Mega Hero: ఆ మెగాహీరో ఇలా చేస్తున్నారు ఏంటో.. అడ్వాన్స్ వెనక్కు ఇవ్వకుండా తిప్పలు!

సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు హీరోలు, కొందరు నిర్మాతలు పారితోషకం విషయంలో కాస్త తిప్పలు పెడుతూ ఉంటారు.మామూలుగా నిర్మాతలే నటీనటులకు ఇచ్చే పారితోషకములలో బాగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు.

 That Mega Hero Not Giving Advance Money Back To Producer Details, Megahero ,,tol-TeluguStop.com

కోరిందంతా ఇవ్వకుండా తమకు నచ్చినంతనే ఇచ్చి వారికి అసంతృప్తిని మిగిలిస్తారు.

ఇక కొందరు నిర్మాతలు అలా కాదు నటీనటులు కోరినంత ఇచ్చేస్తారు.

ఏ విషయంలో కూడా రాజీ పడకుండా అన్ని అందిస్తారు.అయితే కొన్ని సార్లు సినిమా కోసం కమిట్మెంట్ తీసుకొని ముందుగానే అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాతలు కూడా ఉంటారు.

ఒకవేళ ఆ సినిమా ఆగిపోతే వెంటనే నటినటులు ఆ డబ్బును వెనక్కి ఇచ్చేస్తారు.నిజానికి అలా ఇవ్వటం ధర్మం.

ఎందుకంటే ముందు డబ్బులు తీసుకొని ఆ తర్వాత సినిమా ఆగిపోతే మనం కూడా ఏమి చేయలేం.పైగా నిర్మాత కూడా ఎంతో కష్టపడి సినిమా కోసం డబ్బులు జమ చేస్తుంటాడు కాబట్టి.

అయితే కొన్ని కొన్ని సార్లు సినిమా ఆగిపోయిందని తెలిసినా కూడా నిర్మాతలకు వెనక్కి డబ్బు ఇవ్వటానికి కొందరు నటి నటులు సహకరించారు.

Telugu Advance, Megahero, Tollywood-Movie

సినిమా సెట్ లో అడుగు పెట్టకున్నా కూడా డబ్బులు వెనక్కి ఇవ్వడానికి నిరాకరించారు.ఏమైనా అంటే ఆ సమయంలో కమిట్మెంట్ సినిమాలు వదులుకున్నాము అంటూ దానివల్ల లాస్ అయ్యాము తిరిగి డబ్బులు ఇవ్వకుండా నిర్మాతలను ఇబ్బంది పెడుతుంటారు.గతంలో ఒక హీరోయిన్ కూడా అలాగే చేయడంతో తనని ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేశారు.

అయితే తాజాగా ఒక మెగా హీరో కూడా డబ్బులు ఇవ్వకుండా అలాగే మారం చేస్తున్నాడు.

ఇంతకు అసలు విషయం ఏంటంటే.

ఓ నిర్మాత ఒక పెద్ద బ్యానర్ అసోసియేషన్ లో ఒక చిన్న మెగా హీరోతో సినిమా చేయాలని అనుకున్నాడు.అన్నట్టుగానే ఆ మెగా హీరోకి కథ చెప్పి అడ్వాన్స్ గా పాతిక లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చాడు.

అయితే ఆ హీరో మాత్రం కోరికలను పెద్దగా కోరాడు.అంటే తన సినిమాకు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావాలని, మంచి సినిమాటోగ్రాఫర్ కావాలి అంటూ డిమాండ్ చేశాడు.

Telugu Advance, Megahero, Tollywood-Movie

దీంతో ఆ హీరో అటువంటివి డిమాండ్లు చేయటంతో వెంటనే ఆ పెద్ద బ్యానర్ కూడా పక్కకు తప్పుకుంది.కానీ ఆ నిర్మాత మాత్రం హీరోకి పాతిక లక్షలు ఇచ్చేశాడు కూడా.ఇక చివరికి నిర్మాత కూడా ఆ సినిమాను వదులుకున్నాడు.దీంతో ఆ నిర్మాత ఆ హీరో దగ్గరికి వెళ్లి పాతిక లక్షలు వెనక్కి ఇవ్వమని అడగటంతో ఆ హీరో నేను ఇవ్వను అన్నట్లు మాట్లాడాడట.

పైగా ఆ నిర్మాత ఫిక్స్ చేసిన సినిమా చేయకపోవటం వల్ల అప్పటికే లైన్లో ఉన్న తన సినిమా ఆలస్యమైందని అన్నాడట హీరో.దీంతో ఆ నిర్మాతకు సినిమా మీద పెట్టుకున్న పది లక్షలు, హీరోకి ఇచ్చిన పాతిక లక్షలు మొత్తం కలిపి 35 లక్షలు లాస్ కావటంతో చాలా బాధపడుతున్నట్లు తెలిసింది.

దీంతో ఈ విషయం తెలిసిన కొందరు ఆ మెగా హీరోని బాగా దుమ్మెత్తిపోస్తున్నారు.ఆ చిన్న నిర్మాతను అలా బాధ పెట్టడం కరెక్టు కాదు.

న్యాయం పరంగా ఆయనకు ఆ డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వాలి అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube