Yashoda Digital Rights OTT : ప్రముఖ ఓటీటీ సంస్థకు యశోద డిజిటల్ రైట్స్?

హరి హరీష్ ద్వయ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద.పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Yashoda Digital Rights To Leading Ott Company , Yashoda Digital Rights , Ott ,-TeluguStop.com

లేడీ ఓరియంటెడ్ చిత్రంగా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 11వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలలో ఏకకాలం విడుదలయ్యి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది.ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

Telugu Amazon Prime, Hari Harish, Samantha, Yashoda-Movie

సమంత అనారోగ్య సమస్యల కారణంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.అయినప్పటికీ ఈ సినిమా పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోవడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ డీల్స్ కూడా బాగా కుదిరినట్టు తెలుస్తోంది.ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో ఈ సినిమా డిజిటల్ హక్కులు కూడా మంచి ధరలకే అమ్ముడుపోయినట్టు సమాచారం.

ఈ క్రమంలోనే యశోద డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది.

Telugu Amazon Prime, Hari Harish, Samantha, Yashoda-Movie

ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ఏకంగా 45 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది.ఇకపోతే ఈ సినిమా నవంబర్ 11వ తేదీ థియేటర్లో విడుదల కావడంతో దాదాపు 8 వారాలు పూర్తి అయ్యేవరకు అమెజాన్ లో ప్రసారం కాదని తెలుస్తోంది.సమంత నాగచైతన్యత విడాకులు తీసుకున్న తర్వాత మొదటిసారిగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక కమర్షియల్ గా ఈ సినిమా ఏ విధమైనటువంటి కలెక్షన్లను రాబడుతుందో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube