ఒకవైపు తెలుగు లో కమల్ హాసన్ హీరోగా కె.విశ్వనాధ్ 1986 లో స్వాతి ముత్యం సినిమా తీస్తున్నాడు.
ఇది మన ఆంధ్రలో జరుగుతున్న కథ.ఇక కర్ణాటక రాష్ట్రంలో కమల్ హాసన్ అన్న చారు హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా తబరన కథె. అంటే తబరుని కథ అని అర్ధం.ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది దర్శకుడు గిరీష్ కాసరవెల్లి.
చారు హాసన్ కూతురు మన పథ హీరోయిన్ సుహాసిని.అయితే ఇద్దరు అన్నదమ్ములు ఎవరి సినిమా వారు చేస్తుంటే పెద్ద వింతేముంది.
ఇన్నేళ్ల తర్వాత కూడా మనం మాట్లాడుకోవడానికి అంత అవసరం ఏముంది.అందుకే ఇక్కడ అసలు విషయం మనం తప్పకుండ తెలుసుకోవాలి.
కమల్ హాసన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించాడు.నటుడిగా జీవించడానికే పుట్టాడు.
కానీ అతడి అన్న అలా కాదు.అయన నాతనజీవిత 50 ఏళ్ళ వయసులో ప్రారంభం అయ్యింది.
మొదటి ముప్పై ఏళ్ళు అతడు న్యాయవాదిగా పని చేసాడు.కన్నడ సినిమా రంగంలో రిటైర్మెంట్ తీసుకొని రంగప్రవేశం చేసాడు.
ఇక అయన తబర’ అంటే ఒక వాచ్ మెన్ పాత్ర లో నటించే సమయానికి అయన వయసు 56 .ఈ సినిమాలో అయన నటన ఎంతో అద్భుతం.ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే వాచ్ మెన్ కి పదవి విరమణ పొందాక తనకు రావాల్సిన డబ్బు రాకపోవడం, అనారోగ్యం బారిన పడిన తన భార్య కోసం ఆ వృద్ధుడు పడే తాపత్రయమే ఈ సినిమా కథ.
ఒక నిజాయితీ కలిగిన ఉద్యోగి అవినీతి అధికారాల చేతిలో ఎలా నలిగిపోయాడో చక్కగా చూపించాడు దర్శకుడు.మరోవైపు స్వాతి ముత్యం ఎంతో పెద్ద విజయాన్ని మూటగట్టుకుంది.ఇద్దరి సినిమాలు జాతీయ ఉత్తమ నటుడి రేసులో ఉన్నాయ్.
కానీ కమల్ హాసన్ ని కాదని కమిటీ చారు హాసన్ కి ఆ అవార్డు కట్టబెట్టింది.ఇది తమ్ముడిపై అన్న గెలుపు కాదు.56 ఏళ్ళ వయసులో బాషా కానీ భాషలో సినిమాని భుజాల పై మోసి నిశ్శయత, ఆక్రోశం, అమాయకత్వం కలగలిపి అయన నటించిన తీరుకు దక్కిన అవార్డు.కొత్త ఇండస్ట్రీ కి వచ్చే నటులు చారు హాసన్ నటించిన విధానం కోసం అయినా ఒక్కసారి ఈ సినిమాను చూడాలి.