చంద్రబాబు-పవన్ కళ్యాణ్‌ కలిసి కాపురం చేయడానికి ఇంత డ్రామా చేయాలా?

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లది రహస్య ప్రేమని, కలిసి కాపురం చేయడానికి ఇంతకాలం డ్రామా చేశారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు.పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు చంద్రబాబును సీఎం చేయడానికి కష్టపడ్డాడని, తాను ఎప్పుడూ సీఎం కావడానికి ప్రయత్నించలేదని పేర్కొన్నారు.

 Will Chandrababu-pawan Kalyan Do So Much Drama To Make Realationship Together ,-TeluguStop.com

కాకినాడలో మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ.‘రాష్ట్ర వికేంద్రీకరణ, మూడు రాజధానులు, రాయలసీమ అభివృద్ధి, ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధించాలనే తపనతో విశాఖ గర్జన ద్వారా ప్రజలు తమ ఆకాంక్షలను తెలిపారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించినప్పుడు, మంత్రులపై దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలానే చేసింది.రాజకీయాలంటే సినిమాలు కాదు.

’ అని అన్నారు.

‘విశాఖ గర్జనలో చంద్రబాబు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు.

పవన్ కళ్యాణ్ చేస్తున్న రచ్చ మాములు కాదు.సినిమాల్లో క్లైమాక్సుల్లా రాజకీయాలు ఉంటున్నాయి.

పవన్ కళ్యాణ్ ఇదేమీ సినిమా కాదు.సినిమాల్లో చెప్పిన డైలాగుల్లా ఇక్కడ చెప్తే ఎవరూ ఊరుకోరు.

’ అని మాజీ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.ఇంతకాలంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు రహస్యంగా మాటామంతి జరిపినట్లు తెలుస్తోందన్నారు.

ఇప్పుడు అందరి ముందు వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ బహిరంగం అయిందని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు.ఇద్దరూ కలిసి రాజకీయాలు చేయాలని అనుకున్నప్పుడు ఇంత డ్రామా చేయాల్సిన అవసరం ఏముందని మండిపడ్డారు.

Telugu Andhra Pradesh, Chandrababu, Kannababu, Pawan Kalyan-Political

2014లో పార్టీ పెట్టి పోటీ చేయలేదు.2019లో చంద్రబాబు అధికారంలో ఉండటంతో వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా విడిగా పోటీ చేశారు.చివరకు చంద్రబాబుకే దాసోహం అయ్యారని మాజీ మంత్రి కన్నబాబు ఆరోపించారు.జనసేన పార్టీ బీ ఫారాలను టీడీపీ అభ్యర్థుల చేతిలో పెట్టినట్లు కన్నబాబు తెలిపారు.రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడిగా పోటీ చేసినా కలిసే ఉంటారని మాజీ మంత్రి పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube