మీడియాని ఫేస్ చేసేందుకు సమంత సిద్ధమా..!

సౌత్ స్టార్ హీరోయిన్ అయిన సమంత అక్కినేని నాగ చైతన్యని ప్రేమించి పెళ్లాడింది.అయితే వారి వివాహ బంధం ఎంతోకాలం నిలబడలేదు.

 Samantha Will Face Media After Divorce Yashoda Movie Promotions,samantha,yashoda-TeluguStop.com

సమంత, చైతన్యలు 3 ఏళ్లకే ఎవరి దారి వారు చూసుకున్నారు.ఆఫ్టర్ డైవర్స్ సినిమాల మీద పూర్తి ఫోకస్ పెట్టిన సమంత తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ వస్తుంది.

అయితే ఆఫ్టర్ డైవర్స్ చైతన్యతో విడిపోయిన విషయాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసిన సమంత ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు.ఎయిర్ పోర్ట్ లో కానీ ఎక్కడైనా సరే మీడియా వాళ్లు కనిపించినా సరే వాళ్లు అడిగే ప్రశ్నలను స్కిప్ చేసి వెళ్లింది.

అయితే సమంత నటిస్తున్న యశోద సినిమా నవంబర్ 11న రిలీజ్ ఫిక్స్ చేశారు.ఈ సినిమా ప్రమోషన్స్ లో సమంత మీడియాని ఫేస్ చేయాల్సి ఉంది.

తప్పకుండా సమంతకి సినిమాకు సంబందించిన ప్రశ్నలతో పాటుగా పర్సనల్ ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంది.మరి సమంత మీడియాని ఫేస్ చేసేందుకు సిద్ధమా.

వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతుందా అన్నది తెలియాల్సి ఉంది.యశోద సినిమా హరి హరీష్ దర్శక ద్వయం డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube