ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ టీజర్ పై ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయనే సంగతి తెలిసిందే.ఊహించని రేంజ్ లో ట్రోల్స్ వస్తాయని ఆదిపురుష్ మేకర్స్ కూడా ఊహించి ఉండరు.
తాజాగా మంచు విష్ణు ఆదిపురుష్ టీజర్ గురించి స్పందించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆదిపురుష్ టీజర్ నన్ను నిరాశకు గురి చేసిందని ఆయన అన్నారు.
ఆదిపురుష్ చిత్రయూనిట్ నన్ను మోసం చేస్తుందేమో అని నాకు అనిపించిందని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.మెయిన్ స్ట్రీమ్ లైవ్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుందని నేను అనుకున్నానని టీజర్ లో ఆదిపురుష్ మూవీని యానిమేషన్ మూవీలా చూపించడంతో నేను నిరాశకు గురయ్యానని విష్ణు చెప్పుకొచ్చారు.
మేకర్స్ ముందుగానే ఆదిపురుష్ మూవీ యానిమేషన్ మూవీ అని చెప్పి ఉంటే సరిపోయేదని విష్ణు పేర్కొన్నారు.
ఆదిపురుష్ టీజర్ చూస్తున్న సమయంలో నాకు కొచ్చాడియాన్ మూవీ గుర్తుకు వచ్చిందని విష్ణు కామెంట్లు చేశారు.
సినిమాలో యానిమేషన్ గ్రాఫిక్స్ ను ఏ విధంగా చూపించినా బెనిఫిట్ ఉండదని విష్ణు తెలిపారు.మంచు విష్ణు ఆదిపురుష్ టీజర్ గురించి ఈ విధంగా కామెంట్లు చేస్తారని అస్సలు అనుకోలేదని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

జిన్నా సినిమా రిలీజ్ సమయంలో ఈ తరహా కామెంట్లు కరెక్ట్ కాదని మరి కొందరు అభిప్రాయం వ్యకం చేస్తున్నారు.మంచు విష్ణు చేసిన కామెంట్లు అతనికి ప్లస్ అవుతాయో మైనస్ అవుతాయో చూడాల్సి ఉంది.మంచు విష్ణు సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ప్రభాస్ మూవీ ఆదిపురుష్ అందరి అంచనాలకు భిన్నంగా సక్సెస్ సాధిస్తే మాత్రం విమర్శలు చేసిన వాళ్లకే ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.