ఆ విషయంలో జగన్ సర్కారుకు మద్దతు తెలిపిన జబర్దస్త్ అప్పారావు?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ అప్పారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తాజాగా ఈయన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

 Jabardasth Comedian Apparao Supports Vishaka Garjana By Jagan Government Details-TeluguStop.com

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇంతకీ అప్పారావు ఏ విషయంపై మద్దతు తెలిపారు అనే విషయానికి వస్తే.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో పట్టుదలతో ఉంది.ఇందుకు మద్దతుగా ఈ నెల 15వ తేదీ శనివారం విశాఖ గర్జనకు వైసీపీ ప్రభుత్వం పిలుపునిచ్చారు.

ఈ క్రమంలోనే విశాఖ గర్జనకు ఈయన సపోర్ట్ చేస్తూ షేర్ చేసినటువంటి వీడియో సోషల్ మీడియా వైరల్ గా ఉంది.విశాఖ గర్జనకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలంటూ ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని కోరుకున్నారు.

విశాఖను పరిపాలన రాజధాని కోసం ఇక్కడి కళాకారుడిగా విశాఖ గర్జనకు ఈయన మద్దతు తెలిపారు.విశాఖ పరిపాలన రాజధానిగా చేయాలని.ఈ మహాకార్యంలో పాల్గొనే వారికి ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపే వారికి ధన్యవాదాలు అంటూ ఈయన మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే జబర్దస్త్ అప్పారావు చేసినటువంటి ఈ వీడియో పై కొందరు వైసీపీ అభిమానులు నేతలు ప్రశంసలు కురిపించడం మరికొందరు మాత్రం ఏదో కామెడీ షోలు చేసుకోకుండా నీకెందుకు ఈ రాజకీయాలు, రాజధానులు అంటూ పెద్ద ఎత్తున అప్పారావు పై ట్రోల్ చేస్తున్నారు.ఏది ఏమైనా ఈయన షేర్ చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇకపోతే అప్పారావు జబర్దస్త్ కార్యక్రమంలో స్టార్ మా లో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ కార్యక్రమంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube