ఆ విషయంలో జగన్ సర్కారుకు మద్దతు తెలిపిన జబర్దస్త్ అప్పారావు?
TeluguStop.com
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ అప్పారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తాజాగా ఈయన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇంతకీ అప్పారావు ఏ విషయంపై మద్దతు తెలిపారు అనే విషయానికి వస్తే.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో పట్టుదలతో ఉంది.ఇందుకు మద్దతుగా ఈ నెల 15వ తేదీ శనివారం విశాఖ గర్జనకు వైసీపీ ప్రభుత్వం పిలుపునిచ్చారు.
ఈ క్రమంలోనే విశాఖ గర్జనకు ఈయన సపోర్ట్ చేస్తూ షేర్ చేసినటువంటి వీడియో సోషల్ మీడియా వైరల్ గా ఉంది.
విశాఖ గర్జనకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలంటూ ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని కోరుకున్నారు.
విశాఖను పరిపాలన రాజధాని కోసం ఇక్కడి కళాకారుడిగా విశాఖ గర్జనకు ఈయన మద్దతు తెలిపారు.
విశాఖ పరిపాలన రాజధానిగా చేయాలని.ఈ మహాకార్యంలో పాల్గొనే వారికి ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపే వారికి ధన్యవాదాలు అంటూ ఈయన మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.
"""/"/
ఈ క్రమంలోనే జబర్దస్త్ అప్పారావు చేసినటువంటి ఈ వీడియో పై కొందరు వైసీపీ అభిమానులు నేతలు ప్రశంసలు కురిపించడం మరికొందరు మాత్రం ఏదో కామెడీ షోలు చేసుకోకుండా నీకెందుకు ఈ రాజకీయాలు, రాజధానులు అంటూ పెద్ద ఎత్తున అప్పారావు పై ట్రోల్ చేస్తున్నారు.
ఏది ఏమైనా ఈయన షేర్ చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇకపోతే అప్పారావు జబర్దస్త్ కార్యక్రమంలో స్టార్ మా లో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ కార్యక్రమంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
మోకాళ్ల నొప్పులకు 20 నిమిషాల్లో చెక్.. ఫిట్‌నెస్ ట్రైనర్ సీక్రెట్ రొటీన్ లీక్!