నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి.మునుగోడులో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఉపఎన్నికకు సంబంధించి స్టీరింగ్ కమిటీని ప్రకటించింది.మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అధ్యక్షునిగా.
పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి కో ఆర్డినేటర్ గా వ్యవహరించనున్నారు.కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి తదితరులు ఉన్నారు.