నటి అపర్ణ బాలమురళి. ఈ పేరు వినగానే చాలామందికి ఆకాశం నీ హద్దురా సినిమా గుర్తుకొస్తుంది.
ఈ సినిమాలో ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇందులో ఆమె నటనను చూసి తెలుగు ప్రేక్షకులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.
కాగా ఇదే సినిమా తమిళంలో సూరరైపోట్రు అని పేరుతో విడుదలైన విషయం తెలిసిందే.తమిళ ప్రేక్షకులు కూడా ఆమె నటనను చూసి ఫిదా అయ్యారు.
తమిళ సినిమా అయినా సూరరైపోట్రు సినిమాను తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో సినిమా విడుదల చేశారు.
ప్రముఖ మలయాళ కథానాయకి అయిన అపర్ణ బాలమురళి ఈ సినిమా కంటే ముందుగా తోట్టాగళ్,సర్వం తాళమయం, తీదుమ్ నానుమ్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కానీ అన్ని సినిమాల కంటే ఈమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది మాత్రం సూరరైపోట్రు సినిమానే అని చెప్పవచ్చు.కాగా ఇందులో హీరోగా సూర్య నటించిన విషయం తెలిసిందే.
అయితే సూరరైపోట్రు సినిమా తరువాత విశేషం సినిమాలో నటించగా అప్పటికే అపర్ణ లావు అయింది అంటూ విమర్శలు వినిపించాయట.

ఇకపోతే అపర్ణ ప్రస్తుతం తమిళంలో నిత్యం ఆరుదానం అనే సినిమాలో నటిస్తోంది.ఇందులో అశోక్ సెల్వన్ నటిస్తున్నాడు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమావుతోంది.
ఇదిలా ఉంటే ఇటీవలే ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ను విడుదల చేశారు మూవీ మేకర్స్.ఇక అందులో అపర్ణ బొద్దుగా కొంచెం లావుగా కనిపించడంతో ఆమెపై ట్రోలోంగ్స్ చేయడం మొదలుపెట్టారు.
ఈ విషయంపై అపర్ణ స్పందిస్తూ శరీర బరువుకు ప్రతిభకు సంబంధమే లేదు అని ఆమె చెప్పుకొచ్చింది.

అయితే మొదట అటువంటి కామెంట్స్ వినిపించినప్పుడు ఆమె చాలా బాధపడిందట.ఇంకొందరు అయితే ఆమెను అమ్మ పాత్రలు నటిస్తావా అని అడిగారట.అయితే తనకి ఎంతో వయసు లేదని ఆమె తెలిపింది.
అయితే ఇప్పుడు అటువంటి వాటిని అసలు పట్టించుకోవడంలేదని, ఆరోగ్య కారణాల వల్ల లేదా ఇతర కారణాల వల్ల శరీరంలో బరువు ఉండవచ్చు అని అపర్ణ చెప్పుకొచ్చింది.అయితే స్టార్ హీరో అయిన సూర్యతో కలిసి నటించినప్పటికి అప్పుడే తల్లిపాత్రల్లో నటిస్తావా అని అడగటం అన్నది బాధాకరమైన విషయం అని చెప్పవచ్చు.