హైదరాబాద్ లోని చార్మినార్ లో బీజేపీ ఆధ్వర్యంలో మహిళలు ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ చేపట్టారు.సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవం కేంద్రం నిర్వహించనున్న విషయం తెలిసిందే.
ఈ అమృత మహోత్సవాలలో భాగంగా చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి అసెంబ్లీ ముందున్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు మహిళల బైక్ ర్యాలీ నిర్వహించారు.కాగా ఈ ర్యాలీని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.
అంతకముందు భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు.







