టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో ఒకరైన రమ్యకృష్ణకు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న నటీమణులలో రమ్యకృష్ణ ఒకరు.
అయితే బాహుబలి1, బాహుబలి2 సినిమాల విజయాలు రమ్యకృష్ణ క్రేజ్ ను పెంచినా ఈ మధ్య కాలంలో ఆమె నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.
అఖిల్ హీరోగా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన హలో సినిమాలో రమ్యకృష్ణ కీలక్ పాత్రలో నటించగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.
రమ్యకృష్ణ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన రిపబ్లిక్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే.రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన శైలజారెడ్డి అల్లుడు సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.
రొమాంటిక్ సినిమాలో రమ్యకృష్ణ నటించగా ఈ సినిమా కూడా ఆశించిన రిజల్ట్ ను సొంతం చేసుకోలేదు.తాజాగా లైగర్ సినిమాతో రమ్యకృష్ణకు మరో షాక్ తగిలింది.
నాగార్జున, రమ్యకృష్ణ కాంబోలో తెరకెక్కి ఈ ఏడాది విడుదలైన బంగార్రాజు సినిమా యావరేజ్ రిజల్ట్ ను అందుకుందనే సంగతి తెలిసిందే.రమ్యకృష్ణ ప్రస్తుతం రోజుకు 10 లక్షల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

రాజమౌళి సెంటిమెంట్ శాపం రమ్యకృష్ణను వెంటాడుతోందని అందువల్లే ఆమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటున్నాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.రమ్యకృష్ణ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.వరుసగా ఫ్లాపులు వస్తే రమ్యకృష్ణ కెరీర్ కు ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.