ప్రస్తుత వర్షాకాలంలో అత్యధికంగా వేధించే జుట్టు సమస్యల్లో చుండ్రు ముందు వరసలో ఉంటుంది.ఈ చుండ్రును నిర్లక్ష్యం చేస్తే తలలో తీవ్రమైన దురద, ఇరిటేషన్, మొటిమలు, హెయిర్ ఫాల్ వంటి రకరకాల సమస్యలు ఇబ్బంది పెడతాయి.
అందుకే చుండ్రును వదిలించుకోవడం కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే టెన్షన్ వద్దు.నల్ల మిరియాలతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా మాయం అవ్వడం ఖాయం.
మరి ఇంకెందుకు లేటు నల్ల మిరియాలతో చుండ్రును ఎలా పోగొట్టుకోవాలో ఓ చూపు చూసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నల్ల మిరియాలను వేసి ఒక నిమిషాం పాటు వేయించుకోవాలి.
ఆ తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఉసిరి కాయ పొడి, దంచి పెట్టుకున్న మిరియాల పొడి, మూడు టేబుల్ స్పూన్ల పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం వేసుకుని అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు మాత్రమే కాకుండా జుట్టు మొత్తానికి కూడా పట్టించి షవర్ క్యాప్‌ను ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో హెడ్ బాత్ చేయాలి.వారంలో రెండు సార్లు ఈ విధంగా హెయిర్ ప్యాక్ వేసుకుంటే.నల్ల మిరియాలు, ఉసిరి పొడి, పెరుగు మరియు నిమ్మ రసంలో ఉంటే ప్రత్యేక సుగుణాలు చుండ్రును తరిమి కొట్టి తలను శుభ్రంగా మారుస్తాయి.
అంతేకాదండోయ్.ఈ హెయిర్ ప్యాక్ ను యూస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.
ఆయిలీ హెయిర్ నుంచి సైతం విముక్తి లభిస్తుంది.