ఆరు దశాబ్దాల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన కుటుంబం అక్కినేని కుటుంబం.ప్రస్తుతం టాలీవుడ్ లో అక్కినేని మూడోతరం హీరోలుగా నాగచైతన్య, అఖిల్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ఫుల్ హీరోలుగా అక్కినేని ఫ్యామిలీ పేరుని నిలబెడుతున్నారు.
ఇక ఈ ఫ్యామిలీకి నాటి లెజెండ్రీ హీరో అక్కినేని వేసిన మొదటి అడుగు ప్రస్తుతం అనేక మంది అభిమానుల హృదయాల్లో వారి కుటుంబానికి మంచి స్థానం కలిగించేలా చేసింది.అక్కినేని వారసుడుగా మన్మధుడు నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే 40 సంవత్సరాలుగా హీరోగా కంటిన్యూ అవుతున్నారు.
ఆయన వారసుడిగా తన కొడుకులు ఇద్దరిని కూడా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు నాగార్జున.
కేవలం వీరి కుటుంబం నటనకు మాత్రమే పరిమితం కాలేదు.
నాగార్జున హీరోగా నటిస్తూనే మంచి బిజినెస్ మాన్ గా కూడా మారాడు.నిర్మాతగా తన సత్తా ఏంటో టాలీవుడ్ కి రుచి చూపించాడు .ఎప్పుడూ లాభాలు వచ్చే పని చేస్తూ మంచి వ్యాపారి అనే పేరు కూడా సంపాదించుకున్నాడు.ఏ రంగంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయో నాగార్జున అందులోనే డబ్బులు పెట్టి బాగా సంపాదించాడు కూడా.
ఇక నాగార్జున మొదటగా దివంగత నిర్మాత రామానాయుడు కుమార్తె లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు వారికి సంతానంగా నాగచైతన్య పుట్టాడు.
ఇక లక్ష్మికి నాగార్జునకి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకున్న నాగార్జున తన తోటి హీరోయిన్ అయినా అమలని మరోమారు పెళ్లి చేసుకున్నాడు.
అయితే అమల నాగార్జునల పెళ్లికి అక్కినేని మొదట అభ్యంతరం వ్యక్తం చేశారట.ఎందుకంటే ఏఎన్ఆర్ చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి.
సినిమా రంగంలో ఉన్న వారి జీవితాలు సక్రమంగా ముందుకు సాగాలంటే ఇద్దరు కూడా ఇండస్ట్రీలో ఉండడం కుదరదని ఆయన చెప్పేవారట.
అక్కినేని సినిమాలో నటిస్తున్న సమయంలో ఆయన భార్య అన్నపూర్ణ ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది.అందుకే ఒకరు నటిస్తే, ఒకరు ఇంటిని చూసుకున్నారు.అందుకే వారి వివాహం సక్సెస్ఫుల్ గా నడిచింది.
కానీ నాగార్జున విడాకులు తీసుకుని సినిమా రంగంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ముందు ముందు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఆందోళన చెందే వారట.అందుకే మొదట అమలను కోడలు గా ఒప్పుకోలేదు అంతేకాదు, అమలకు అసలు తెలుగు రాదు తెలుగింటి అమ్మాయి కూడా కాదు.
అందుకే అక్కినేని అమల విషయంలో అనేక అనుమానాలను కలిగి ఉండేవాడట.ఏది ఏమైనా నాగార్జున ఒత్తిడి చేయడంతో వీరి పెళ్లి జరిగింది ప్రస్తుతం వీరు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు
.