ఆ విషయంలో బాలీవుడ్ ను ఫాలో అవుతున్న సౌత్!

మన ఇండియన్ సినిమా పరిశ్రమలో అతి పెద్దది అంటే బాలీవుడ్ అనే చెబుతారు.మరి బాలీవుడ్ లో కొన్ని విషయాల్లో ట్రెండ్ సెట్ చేసారు.

 Bollywood Trend To The South In Doing Sequel To Movies Vikram Chandramukhi Kaith-TeluguStop.com

అందులో సీక్వెన్స్ తీసి హిట్ కొట్టడం ఒకటి.ఎప్పుడు పది పదిహేను సంవత్సరాల ముందు రిలీజ్ అయినా సినిమాలకు కూడా ఇప్పుడు సీక్వెల్ తీసి హిట్ కొట్టిన ఘనత బాలీవుడ్ కి ఉంది.

ఆ విషయంలో ఇది ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి.

బాలీవుడ్ ప్రేక్షకులు కూడా సీక్వెన్స్ సినిమాలను బాగా ఆదరిస్తారు.

అక్కడ వర్కౌట్ అయినంత మన సౌత్ లో వర్కౌట్ అవ్వలేదు.మన సౌత్ లో ఇలా సీక్వెల్ ట్రెండ్ ఇంతకు ముందు చాలా తక్కువుగానే ఉంది.

చేసిన కూడా మొదటి పార్ట్ హిట్ కొట్టినంత సీక్వెన్స్ విజయాలు సాధించలేక పోయేయి.దాంతో మన మేకర్స్ సైతం సీక్వెన్స్ పేరు ఎత్తేవారు కాదు.

అయితే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ మారిపోయింది.మన సౌత్ పరిశ్రమ కూడా బాలీవుడ్ ను ఈ విషయంలో ఫాలో అవుతుంది.మన సౌత్ ప్రేక్షకులు రొటీన్ కథలను యాక్సెప్ట్ చేయడం లేదు.అందుకే సరికొత్త కంటెంట్ తో మేకర్స్ ప్రేక్షకుల ముందు వచ్చి హిట్ కొడుతున్నారు.

మేకర్స్ కొంతమంది సీక్వెన్స్ చేస్తూ మంచి హిట్ కూడా అందుకుంటున్నారు.

Telugu Bahubali, Bollywood, Chandramukhi, Indian, Kaithi, Karthikeya, Ponniyan S

కెజిఎఫ్, బాహుబలి లాంటి సినిమాలు సీక్వెల్స్ ట్రై చేసి విజయం సాధించాయి.ఇక ఇప్పుడు సింగం 4, తని ఒరువన్ 2 వంటి సీక్వెల్స్ ను కూడా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.ఇక మన టాలీవుడ్ కార్తికేయ 2 కూడా తెరకెక్కి రిలీజ్ కు రెడీగా ఉంది.

ఇక కెజిఎఫ్ 1,2 ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక ఇప్పుడు చాప్టర్ 3 కూడా తెరకెక్కే అవకాశం కనిపిస్తుంది.

Telugu Bahubali, Bollywood, Chandramukhi, Indian, Kaithi, Karthikeya, Ponniyan S

అంతేకాదు పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలుగా వస్తుండగా.ఇంకోవైపు చంద్రముఖి 2 తెరకెక్కుతుంది.భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 ను శంకర్ తెరకెక్కించ బోతున్నాడు.అలాగే విక్రమ్ 2, ఖైదీ 2 సినిమాలు తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇలా బాలీవుడ్ లో ఫేమస్ అయినా సీక్వెన్స్ ట్రెండ్ ను మన సౌత్ వాళ్ళు కూడా ఫాలో చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube