నాగచైతన్యపై చంపేంత కోపమేంటి సామ్.. ఏం తప్పు చేశాడంటూ?

అక్కినేని హీరో నాగచైతన్య అభిమానులు గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న థాంక్యూ మూవీ ఈరోజు థియేటర్లలో విడుదలైంది.చైతన్య నటనకు ప్రశంసలు దక్కినా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో థాంక్యూ మూవీ ఫెయిలైంది.

 Samantha Shocking Comments About Chaitanya Goes Viral Details, Naga Chaitanya, S-TeluguStop.com

అదే సమయంలో సమంత విడాకుల గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.ఈ వ్యాఖ్యలు విన్న నెటిజన్లు చైతన్య, సమంత మధ్య ఈ స్థాయిలో శతృత్వం ఉందా అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఒకే గదిలో నేను, చైతన్య ఉంటే పదునైన వస్తువులు ఆ గదిలో ఉండకపోవడం మంచిదని సమంత తెలిపారు.ఒకే గదిలో ఇద్దరం ఉంటే ఒకరినొకరు చంపుకునే ఛాన్స్ అయితే ఉందని సమంత పరోక్షంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే చైతన్య అంత పెద్ద తప్పు ఏం చేశాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ చైతన్యదే తప్పు అనే విధంగా నిందించడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Telugu Koffee Karan, Nagachaitanya, Samantha-Movie

తనకు చైతన్యకు మధ్య మంచి అనుబంధం లేదని సమంత చెప్పగా ప్రేమించిన సమయంలో చైసామ్ బాగానే ఉన్నారని పెళ్లైన తర్వాత కూడా బాగానే ఉన్నారని అప్పుడు లేని సమస్య పెళ్లి జరిగిన నాలుగేళ్ల తర్వాత ఎందుకు వచ్చిందని నెటిజన్ల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.మీ భర్త అని యాంకర్ ప్రశ్నించగా మాజీ భర్త అని సమంత చైతన్య గురించి బదులిచ్చారు.

Telugu Koffee Karan, Nagachaitanya, Samantha-Movie

నాగచైతన్య మాత్రం ఇప్పటివరకు సమంత గురించి ఎక్కడా నెగిటివ్ గా చెప్పలేదు.మరోవైపు థాంక్యూ మూవీ రిలీజ్ సమయంలోనే సమంత ఎపిసోడ్ స్ట్రీమింగ్ కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సమంత తన వ్యాఖ్యల వల్ల అక్కినేని అభిమానులకు దూరమవుతూ ఉండటం గమనార్హం.మరోవైపు ఫ్లాప్ టాక్ తో థాంక్యూ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube