డార్క్ నెక్.ఎందరినో వేధించే సమస్య ఇది.
కొందరి ముఖం ఎంతో తెల్లగా ఉంటుంది.కానీ, మెడ మాత్రం నల్లగా కనిపిస్తుంది.
శరీరంలో అధిక వేడి, ఆహారపు అలవాట్లు, పలు రకాల మందుల వాడకం, ఒత్తిడి, మృతకణాలు పేరుకుపోవడం, ఎండల ప్రభావం వంటి రకరకాల కారణాల వల్ల మెడ నల్లగా మారుతుంటుంది.దాంతో నల్లగా మారిన మెడను తెల్లగా మార్చుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే అస్సలు కలవర పడకండి.
ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే రెమెడీని ట్రై చేస్తే మెడ ఎంత నల్లగా ఉన్నా వారం రోజుల్లోనే తెల్లగా మారడం ఖాయం.మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో చూసేయండి.
ముందుగా ఒక డావ్ సోప్‌ను తీసుకుని సన్నగా తురుముకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు పాలు పోయాలి.
పాలు కాస్త హీట్ అవ్వగానే అందులో డావ్ సోప్ తురుము వేసి పూర్తిగా కరిగే వరకు ఉడికించాలి.ఇలా ఉడికించుకున్న మిశ్రమాన్ని పూర్తిగా చల్లారబెట్టుకుని.అప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని అన్ని కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకుని.ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి. ఆపై వేళ్లతో సున్నితంగా రుద్దుకుంటూ గోరు వెచ్చని నీటితో శుభ్రంగా మెడను క్లీన్ చేసుకోవాలి.
ఇలా రోజుకు ఒకసారి చేస్తే గనుక నల్లగా మారిన మెడ తెల్లగా, మృదువుగా మారుతుంది.కాబట్టి, డార్క్ నెక్ తో ఇబ్బంది పడే వారు మదన పడకుండా పైన చెప్పిన రెమెడీని ట్రై చేస్తే మంచి ఫలితం లభిస్తుంది.