జబర్దస్త్ కార్యక్రమం గత వారం రోజుల నుంచి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తుంది.జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన కిరాక్ ఆర్పీ ఈ కార్యక్రమం గురించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
మల్లెమాలవారు డబ్బులు తక్కువగా ఇస్తారని అక్కడ వసతి భోజనాలు కూడా బాగుండవు అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈయన వ్యాఖ్యలపై స్పందిస్తూ జబర్దస్త్ కార్యక్రమంతో సంబంధం ఉన్నవారు ఒక్కొక్కరుగా పలు యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.ఈ క్రమంలోనే గతంలో జబర్దస్త్ కార్యక్రమానికి మేనేజర్ గా పనిచేస్తున్న ఏడుకొండలు ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు.అదేవిధంగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నాగబాబు, రోజా రెమ్యూనరేషన్ గురించి కూడా ఆసక్తికరమైన సమాధానాలు తెలియజేశారు.
రోజాతో పోలిస్తే నాగబాబుకు రెమ్యూనరేషన్ తక్కువ అనే విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఇలా వీరిద్దరికి రెమ్యూనరేషన్ విషయంలో తేడాలు ఉండడానికి గల కారణం ఏంటి అని యాంకర్ ప్రశ్నించారు.ఇక ఈ ప్రశ్నకు ఏడుకొండలు సమాధానం చెబుతూ ఆసక్తికరమైన సమాధానం బయటపెట్టారు.
జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభానికి ముందే నాగబాబు రోజాతో వారు ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని తెలిపారు.రోజా హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కనుక తనకు హీరోయిన్ రేంజ్ లోనే రెమ్యూనరేషన్ ఇచ్చాము.ఇకపోతే నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సపోర్టింగ్ పాత్రలలో నటించడం వల్ల ఆయన పాత్రలకు అనుగుణంగా తనకు రెమ్యూనరేషన్ రోజా కన్నా తక్కువగానే ఇచ్చాము.ఈ విషయాలన్నీ వారికి పూర్తిగా వివరించాకే ఈ కార్యక్రమం మొదలుపెట్టామని ఈ సందర్భంగా ఏడుకొండలు రోజా నాగబాబు రెమ్యూనరేషన్ మధ్య తేడా గురించి వివరించారు.
ఈ క్రమంలోని ఏడుకొండలు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.