టాలీవుడ్ కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుందో అందరికి తెల్సిందే.ఆ సినిమా ఫలితంను దృష్టిలో ఉంచుకుని కూడా మళ్లీ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో కాస్త అటు ఇటుగా అలాంటి సినిమా నే నాగార్జున చేయడం ను అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఎందుకు నాగ్ మళ్లీ అలాంటి కథతోనే ది ఘోస్ట్ సినిమా ను చేస్తున్నాడు అంటూ చాలా మంది చర్చించుకున్నారు.ఇప్పుడు నాగార్జున మరో నిర్ణయం ఆశ్చర్యంగా ఉంది.
ఆయన టాలీవుడ్ కు చెందిన ఒక సీనియర్ దర్శకుడి దర్శకత్వం లో సినిమా ను చేసేందుకు నో చెప్పాడట.ఆ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చాలా మంది దర్శకులతో పోల్చితే ఆ దర్శకుడు ఎక్కువ శాతం సక్సెస్ లను దక్కించుకున్నాడు.కనుక నాగార్జున ఆ దర్శకుడితో సినిమా చేస్తే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున మాత్రం ఆ దర్శకుడికి ఎందుకు నో చెప్పారు అనే విషయంలో క్లారిటీ లేదు.ది ఘోస్ట్ సినిమా ను విడుదల చేసిన తర్వాతే నాగ్ తదుపరి సినిమా ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
పైగా ఒక వెబ్ సిరీస్ కు కూడా ఈయన ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి.
కనుక నాగార్జున కొత్త సినిమా ల విషయంలో అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆసక్తిగా ఉన్నారు.ఎప్పుడెప్పుడు నాగార్జున నుండి అప్డేట్ వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.నాగార్జున మరియు నాగ చైతన్య లతో పాటు అఖిల్ కూడా వరుసగా సినిమా లు చేయాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.
కాని చైతూ ఒక్కడు మాత్రమే బ్యాక్ టు బ్యాక్ సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.