యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలితో నేషనల్ వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.ప్రభాస్ కెరియర్ బాహుబలికి ముందు ఒక ప్రాంతీయ హీరోగా మాత్రమే ఉండగా ఆఫ్టర్ బాహుబలి అతను పాన్ ఇండియా హీరోగా మారాడు.
ఈ క్రమంలో వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తూ ప్రభాస్ తన స్టామినా చూపిస్తున్నాడు.బాహుబలి తర్వాత సాహో, రాధే శ్యామ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్.
అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర గొప్ప ఫలితాలు అందుకోలేదు.
ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్ సినిమాలు చేస్తున్నాడు.
ఓం రౌత్ డైరక్షన్ లో రామాయణ బ్యాక్ డ్రాప్ తో ఆదిపురుష్ సినిమా వస్తుంది.ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా సినిమా ఫైనల్ కాపీ సిద్ధమైనట్టు టాక్.
రీసెంట్ గా ఓం రౌత్ ప్రభాస్ కి ఆదిపురుష్ ఫస్ట్ కాపీ చూపించారట.అది చూసిన ప్రభాస్ సూపర్ హ్యాపీగా ఫీల్ అయ్యారని తెలుస్తుంది.
ముఖ్యంగా ఓం రౌత్ డైరక్షన్ టాలెంట్ కి ఫిదా అయ్యారట.
అంతేకాదు రాముడిగా ప్రభాస్ ని చూపించిన విధానం బాగా ఇంప్రెస్ చేసిందని.
ప్రభాస్, కృతి సనన్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయినట్టు తెలుస్తుంది.ఆదిపురుష్ సినిమా చూసిన ప్రభాస్ ఓం రౌత్ ని గట్టిగా హగ్ చేసుకున్నట్టు సమాచారం.
త్వరలో రిలీజ్ కాబోతున్న ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.ప్రభాస్ ఈ సినిమాతో పాటుగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సలార్ సినిమా చేస్తున్నాడు.
KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా సలార్ వస్తుంది.ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ నటిస్తుంది.ఈ మూవీని 2023 సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె.అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగా తో స్పిరిట్ సినిమాలు లైన్ లో ఉన్నాయి.