దర్శకుడు అనే పదానికి అసలు సిసలైన ఉదాహరణ ఎవరు అంటే తెలుగు ప్రేక్షకులందరూ చెప్పే పేరు దాసరి నారాయణరావు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన సినిమాలతో దర్శకుల అందరిలో ఒక రత్నంగా.దర్శకరత్న గా పేరు సంపాదించుకున్నారు.ఇటీవలి కాలంలో దర్శకులు ఏదైనా సినిమా తీస్తే ఒక్క హిట్ కొట్టిన తర్వాత మరో సినిమా హిట్ట్ అవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి.
కానీ అప్పట్లో ఏకంగా వరుసగా 12 హిట్లు అందించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు.కేవలం దర్శకుడిగానే మాత్రమే కాకుండా నటుడిగా నిర్మాతగా కూడా ఈయన ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గరయ్యారు.
అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగిన ఎంతోమంది దర్శకరత్న దాసరి నారాయణరావు ఛాన్స్ ఇస్తేనే హీరోలుగా మారినవారు చాలామంది ఉన్నారు.కేవలం ఒక దర్శకుడిగా మాత్రమే కాకుండా ఇండస్ట్రీ పెద్దగా తెలుగు చిత్ర పరిశ్రమ బాధ్యతలను భుజాన వేసుకొనీ ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ఎప్పుడూ ముందుండే వారు ఆయన.అందుకే దాసరి నారాయణరావు భౌతికంగా మనకు దూరమైనప్పటికీ ఇప్పటికీ ఆయన గొప్పతనం గురించి ఎంతో మంది సినీ ప్రముఖులు చెబుతూనే ఉంటారు.
ఇక చిత్రపరిశ్రమకు ఎవరో తెలియని ఏకంగా 50 మంది అనామకులకు నటీనటులుగా జన్మనిచ్చి కొత్త జీవితాన్ని ప్రసాదించారూ దాసరి.ఇక 80 మంది సినీ సాంకేతిక వర్గానికి కూడా అవకాశం ఇచ్చి జీవనోపాధిని కల్పించాడు.అయితే గతంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వంగా దాసరి జయంతి ని ప్రకటించింది.
కానీ నేడు దాసరి వర్ధంతిని మాత్రం పూర్తిగా సినీ ప్రముఖులు అందరు మరిచిపోయారు.ఆయన దర్శకత్వంలో చిత్ర పరిశ్రమకు పరిచయమైన వారు సైతం ఇక ఆయన వర్ధంతి గురించి గుర్తు పెట్టుకో లేక పోయారు అని చెప్పాలి.
అయితే ఎవరు మర్చిపోయినా దాసరి నారాయణరావు మాత్రం ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సజీవంగానే వుంటారు అన్నది అక్షర సత్యం అని చెప్పాలి.