ఐ యామ్ ఏ సెలబ్రిటీ ( I'm A Celebrity ) అంటున్న రఘు కుంచే

గాయకుడిగా తన సినీ ప్రస్థానం ప్రారంభించిన రఘు కుంచే సంగీత దర్శకుడిగా , నటుడిగా ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.ఒక వైపు సంగీత దర్శకుడిగా మరో వైపు నటుడిగా ఎన్నో సినిమాలు చేస్తూ , తాను చవిచూసిన అనుభవాలను “ఐ యామ్ ఏ సెలబ్రిటీ” ( I’m A Celebrity) పేరుతో, తనే లిరిక్స్ ని అందించి , మ్యూజిక్ కంపోజ్ చేసి , తనే పాడిన ,ఒక వినోదాత్మకమైన పాటను మన తెలుగు ప్రేక్షకులకు అందించారు.

 ఐ యామ్ ఏ సెలబ్రిటీ ( I’m A Celebrity ) అ-TeluguStop.com

ఇప్పుడు ఆ పాట యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది.

ఐ యామ్ ఏ సెలబ్రిటీ (I’m A Celebrity) పాట విడుదల అయిన సందర్భంగా సంగీత దర్శకుడు రఘు కుంచే మాట్లాడుతూ “ప్రతి మనిషికి సమాజంలో మంచి గుర్తింపు కావాలి అని ఉంటుంది కానీ ,ఆ గుర్తింపు కొందరికే వస్తుంది.

కృషి పట్టుదలతో కొందరు వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, అందరిని మెప్పిస్తారు , అందుకే సమాజంలో వాళ్ళని ప్రత్యేకంగా గౌరవిస్తారు, ఒక సెలబ్రిటీ హోదా ఇస్తారు.సినిమా రంగం అయిన, పొలిటికల్ రంగం విద్యారంగం అయిన , ప్రజలని మెప్పించ గలిగితే చాలు వాళ్ళకి సెలబ్రిటీ హోదా ఇచ్చేస్తారు.

కానీ ఈ సెలబ్రిటీ హోదాని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం.విశృంఖలంగా పెరిగిపోయిన సోషల్ మీడియా ప్రభావం వల్ల, ఒక సెలబ్రిటీ స్థాయిలో ఏమి చేసిన అది మంచి అయినా చెడు అయినా ఒక పెద్ద వైరల్ గా మారుతుంది .నిజం చెప్పాలంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ జీవితం కత్తి మీద సాము లాగా అయిపోయింది.వాళ్ళు ఏమి చేసిన సోషల్ మీడియా లో అదొక పెద్ద వార్త అవుతుంది , మీమ్ అవుతుంది ,యూట్యూబ్ లో థంబ్ నైల్ అవుతుంది.

వీటన్నిటి ఆధారంగానే దీన్ని ఒక వినోదభరితమైన పాట గా మలిచాను.ఐ యామ్ ఏ సెలబ్రిటీ (I’m A Celebrity) పాట మీకు మంచి వినోదాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను.

మరియు , ఈ పాట కేవలం వినోదం కోసం చేసిన పాట మాత్రమే తప్ప ,ఎవరినో కించపరచడానికో, లేక తక్కువ చేయడానికో చేసింది కాదు .ఎవరి మనసులనైనా కష్టపెడితే , క్షమించమని ముందుగానే కోరుకుంటున్నాను .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube