సంతోషంగా బ్రతుకుతున్న మానవ జాతిని చైనా నుండి వచ్చిన em>కరోనా అనే మహమ్మారి అతలాకుతలం చేసింది.ఇది అన్ని పరిశ్రమలతో పాటుగా సినిమా పరిశ్రమపై కూడా ప్రభావం పడింది.
దీనితో గత రెండున్నరేళ్ల నుండి టాలీవుడ్ చాలా నష్టాలను చవిచూసింది.అందుకే ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకున్న చాలా పెద్ద చిత్రాలు రిలీజ్ కు నోచుకోలేదు.
దీనితో ఎప్పుడూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే సందడి థియేటర్ ల వద్ద లేకుండా పోయింది.అయితే మళ్ళీ మంచికాలం వచ్చింది.
ఇప్పుడు కరోనా లేకపోవడంతో థియేటర్ లు ఓపెన్ అయ్యాయి.వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి నిర్మాతల నష్టాలను పూడ్చుతున్నాయి.
దీనితో ఆయా హీరోల ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున థియేటర్ ల వద్ద హంగామా చేస్తూ రెండేళ్ల ముందు వరకు పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి దక్కించుకున్నారు.తమకు నచ్చిన హీరో సినిమా వస్తే ఇక ఆనందం వేరే లెవెల్ అన్ని చెప్పాలి.
అయితే పరిస్థితులు రోజు రోజుకీ మారుతున్నాయి.ఒక సినిమా విడుదల అవుతోంటే మాములు పబ్లిసిటీ కన్నా సోషల్ మీడియా ద్వారా చేస్తున్న పబ్లిసిటీ ఎక్కువయింది.ఎందుకంటే దీని ద్వారానే తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాప్తి కావొచ్చు.అందుకే అన్ని సినిమాల చిత్ర బృందాలు ఈ విధానాన్ని ఎన్నుకుంటున్నారు.
ఇలా ఒక ఫ్యాన్.తన హీరో సినిమా నుండి వచ్చే టైటిల్ నుండి సినిమా రిలీజ్ వరకు అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూసినిమాలకు హైప్ తెస్తున్నారు.
అయితే ఇలా చేయడం మిగతా హీరోల ఫ్యాన్స్ కు నచ్చడం లేదు.దీనితో వారు ఈ హీరోకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ నెట్టింట్లో పోస్ట్ లు పెడుతూ ఉంటారు.
అయితే ఇలా జరగడం వలన అసలు ప్రాబ్లమ్ మొదలవుతోంది.
అయితే ఇది ఎప్పటి నుండి అయితే సోషల్ మీడియా ఎక్కువగా మారిందో.అప్పటి నుండి స్టార్ హీరోలకు ఇది షాకింగ్ గా మారిందని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.అందుకే ప్రేక్షకులు కూడా వీటికి బాగా ప్రభావయుతులై సినిమాలకు వెళుతున్నారు అని కూడా చెప్పవచ్చు.
అయితే ఇలా ఒక హీరో ఫ్యాన్స్ మరొక హీరో సినిమాను నెగిటివ్ గా చేస్తూ ఆఖరికి సినిమాను చంపేస్తున్నారు.ఒక రెండు నెలల నుండి అయితే ఫ్యాన్స్ వార్ ఒక స్థాయిలో ఉన్నది.
ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే రాజమౌళిసినిమా ఆర్ ఆర్ ఆర్ టైంలో కనిపించింది.రామ్ చరణ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ఏ విధంగా రచ్చ చేశారో తెలిసిందే.
అప్పుడు ఊరకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆచార్య రిలీజ్ సమయంలో సినిమాను నెగటివ్ గా స్ప్రెడ్ చేయడం ద్వారా తమ కాసిని తీర్చుకున్నారు.
అందుకే ఆచార్య మూవీ డిజాస్టర్ గా నిలిచింది.ముఖ్యంగా ఈ సినిమాలో చిరు యువకుడిగా ఉన్నప్పుడు మార్ప్ చేసి పెట్టిన ఫోటోను షేర్ చేస్తూ వైరల్ చేసి పరువుతీశారు.ఇప్పటి వరకు చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి.
కానీ కలెక్షన్ లు మాత్రం మోస్తరుగా వచ్చేవి.కానీ ఇప్పుడు పెట్టుబడిలో సగం కూడా రాకుండా కలెక్షన్ లు బాగా డల్ గా ఉన్నాయి.
ఈ కారణంగా సినిమాను కొన్న బయ్యర్లు కూడా రోడ్డున పడుతున్నారు.ఇలాంటి ఘోరాలు అన్నీ జరగడానికి కారణం యాంటీ ఫ్యాన్స్.
ఇప్పుడు నిన్న విడుదలైన మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట ను కూడా యాంటీ ఫ్యాన్స్ వదలడం లేదు.సోషల్ మీడియాలో #DisasterSVP అనే ట్యాగ్ ను వాడుతూ వైరల్ చేస్తున్నారు.
ఇలా ఫ్యాన్స్ పిచ్చి ప్రేమ తెలుగు సినిమా పరిశ్రమను నామరూపాల్లేకుండా చేస్తోంది.అభిమానం ఉండడం మంచిదే కానీ ఇంతలా మరొకరిని నాశనం చేసే అభిమానం అయితే ఎప్పటికీ ప్రమాదమే.
ఒక్క సినిమా డిజాస్టర్ అయితే ఎంత మంది నష్టాలు పాలవుతారు అన్న విషాయం వారికి తెలియదు కాబోలు.ఇకనైనా ఒక్కసారి ఆలోచించుకుని ఇలాంటి పనులను మానుకుంటే ఇండస్ట్రీపైన ఆధారపడి జీవిస్తున్న ప్రతి ఒక్కరూ బాగుపడతారు.