నిజాయితీ, నిబ్బద్దతలకు నిలువుటద్దం కోదాటి దశరధ...పలువురు వక్తల ఘన నివాళి.....

నిజాయితీ, నిబద్దతలకు నిలువుటద్దం కోదాటి దశరథ జీవిత క్రమమని , కోదాటి దశరథ ప్రధమ వర్ధంతి సభ లో వివిధ పార్టీల నాయకులు, వ్యాపార ప్రముఖు లు పేర్కొంటూ ఘన నివాళులు అర్పించారు.సీపీఎం నాయకులు, ఆల్ పెన్షనర్స్ జిల్లా ఉపాధ్యక్షులు కోదాటి దశరథ గత ఏడాది కోవిడ్ తో మృతి చెందాగా, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని స్థానిక మంచికంటి ఫంక్షన్ హాల్ లో ఆల్ పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి మచ్చా రంగయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ప్రముఖ వ్యాపారవేత్త మధుకాన్ గ్రానైట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నామ కృష్ణయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్రావు, సీపీఎం జిల్లా నాయకులు బుగ్గవీటి సరళ, కళ్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేష్ లు పాల్గొని నివాళులు అర్పించి ప్రసంగించారు.

 Kodati Dasharatha ఘన Solid Tribute To Many Speakers…-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగిగా పనిచేస్తూ కార్మిక సంఘo లో చురుకైనా పాత్ర నిర్వహించారని, రైటర్మెంట్ తర్వాత ఆల్ పెన్షనర్స్ యూనియన్ లో గత పదిహేన్నేళ్లుగా నిబద్దత తో పనిచేస్తూ గత ఏడాది కోవిడ్ తో ఆకస్మిక మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు.దశరథ వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ పాటిస్తూ, ఆల్ పెన్షనర్స్ యూనియన్ లో పెన్షనర్స్ సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం కృషి జరిపారని, ఇరిగేషన్ డిప్రార్టుమెంటులో దశరథ మృతి తో నేటివరకు ఆయన స్థానాన్ని భర్తీ చేయలేక పోయమని, అయన లేని లోటు కుటుంబానికే కాదు సీపీఎం పార్టీ కి, ఆల్ పెన్షనర్స్ యూనియన్ కు కూడాతీరని లోటు అని ఆల్ పెన్షనర్స్ జిల్లా కార్యదర్శి కళ్యాణం నాగేశ్వర్రావు ఆవేదన వెలిబుచ్చారు.

ఈ కార్యక్రమం లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జీ.నర్సింఘరావు,జిల్లా నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, ఎర్రా శ్రీకాంత్, అఫ్రోజ్ సమీనా, సూడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్ కమర్థపు మురళి, కుటుంబ సభ్యులు భార్య కనకదుర్గ, కుమారులు కోదాటి గిరి, శ్రీనివాస్ రావ్, కూతురు కొల్లు పద్మ, అల్లుడు మాధవరావు, మనవళ్లు, మానవరాళ్లు, బంధు మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube