దట్ ఈజ్ మహాలక్ష్మి... అనేలా మనవరాలకి గ్రాండ్ గా హెలికాప్టర్ లో స్వాగతం చెప్పిన రైతు..!

ఆడపిల్ల పుట్టిందని భారంగా భావించే ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టిందని తెలిసి ఒక కుటుంబం మొత్తం ఎంతో సంబరపడిపోయారు.ఆ ఆడబిడ్డకు ఎంతో ఘనంగా స్వాగతం కూడా పలికారు.

 Pune Farmer Book Helicopter To Welcome New Born Daughter Details, Helicopter, Vi-TeluguStop.com

అలాంటి ఇలాంటి స్వాగతం కాదండోయ్.ఏకంగా ఆ పాప కోసం హెలికాప్టర్ నే బుక్ చేసి ఘనంగా ఇంటికి తీసుకొవచ్చాడు ఒక తాత.కొన్ని చోట్ల మాత్రం ఇంకా ఆడపిల్లల పట్ల వివక్ష ధోరణి చూపిస్తూనే ఉన్నారు.కానీ ఒక తాత మాత్రం తనకు మనవరాలు పుట్టిందని తెలియడంతో ఎంతో సంబరపడిపోయాడు.

ఆ పాపను మెట్టినింటికి తీసుకు రావడానికి ఏకంగా హెలికాప్టర్ నే బుక్ చేసేసాడు.హెలికాప్టర్ బుక్ చేశాడంటే ఆయన పెద్ద వ్యాపారవేత్తో లేక సినీ సెలబ్రిటీనో అనుకునేరు.

కాదండోయ్ ఆయన ఒక రైతు.

వివరాల్లోకి వెళితే, మహారాష్ట్ర పుణెలోని బాలువాడి ప్రాంతానికి చెందిన అజిత్ పాండురంగ్‌ బల్వాడ్కర్‌ అనే ఒక రైతుకు మనవరాలు పుట్టింది.

ఆ విషయం తెలిసి అజిత్ పాండురంగ్ ఆనందంలో మునిగితేలాడు.ఇక మంగళవారం రోజున ఆ పాపను వాళ్ళ అమ్మమ్మ వాళ్లింటి నుంచి అత్తవారింటికి తీసుకురావడానికి హెలికాప్టర్‌ నే బుక్‌ చేశాడు.

ఇది స్థానికంగా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది.మీడియా వారు కూడా ఈ తాత వద్దకు వెళ్లి ఆయన ఇలా చేయడానికి గల కారణం ఏంటో అడిగి తెలుసుకున్నారు.

Telugu Baby, Helicopter, Ajith Pandurang, Mahalaxmi, Maharshtra, Born, Pune, Lat

“మా కుటుంబంలోకి ఆడపిల్ల రావడం మాకు చాలా ఆనందంగా ఉంది.మా కుటుంబంలోకి అడుగుపెడుతున్న మా చిట్టి కృషికాకు ఎంతో ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయించుకున్నాము.అందుకే ఇలా పాపను హెలికాప్టర్ లో ఇంటికి తీసుకువచ్చాం” అంటూ పాప తాతయ్య అయిన అజిత్ పాండురంగ్ తెలిపారు.

తన కోడలు కూతురికి జన్మనిచ్చిన తర్వాత ఆమె హాస్పిటల్ నుంచి అమ్మగారి ఇంటికి వెళ్లింది.

Telugu Baby, Helicopter, Ajith Pandurang, Mahalaxmi, Maharshtra, Born, Pune, Lat

కోడలు తల్లిగారి ఊరు ఆ రైతు గ్రామానికి సమీపంలోనే ఉండే షేవాల్ వాడి.డెలివరీ అయ్యాక కొన్ని రోజుల పాటు కోడలు,తన మనవరాలు ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు.రెస్ట్ పీరియడ్ ముగిసిన నేపథ్యంలో కోడలిని తన మనవరాలిని అత్తారింటికి తీసుకురావల్సిన క్రమంలో ఆ రైతు తొలిసారిగా తన ఇంటికి వస్తున్న తన మనవరాలిని గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పాలని ఈ నిర్ణయం తీసుకున్నాడు.అలా తన మనవరాలు హెలికాప్టర్‌లో ఇంటికి రావడాన్ని చూసి ఆ తాత తెగ మురిసిపోయాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube