జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా ఫ్లాప్ కావడానికి ప్రభాస్ కారణమా.. ఏమైందంటే?

కొన్ని కాంబినేషన్లలో తెరకెక్కే సినిమాలు భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకులను నిరాశపరుస్తుంటాయి.అలా ఎన్టీఆర్ అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశపరిచిన సినిమాలలో కొన్నేళ్ల క్రితం విడుదలైన రామయ్యా వస్తావయ్యా సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.

 Reasons Behind Ramayya Vastavayya Flop Details Here Goes Viral ,  Flop Result ,-TeluguStop.com

ఈ సినిమా ఫస్టాప్ బాగానే ఉన్నా సెకండాఫ్ మరీ రొటీన్ గా ఉండటంతో సినిమా ఫ్లాపైంది.మాస్ ప్రేక్షకులకు నచ్చిన ఈ సినిమా ఫుల్ రన్ లో 35 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లకు పరిమితమైంది.

ఈ సినిమాను ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు నిర్మించారు.ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ మొదట రామయ్యా వస్తావయ్యా సినిమా కోసం అనుకున్న కథ వేరు అని తెలిపారు.

రామయ్యా వస్తావయ్యా సినిమా విషయంలో జాగ్రత్త పడి ఉంటే ఆ సినిమా రిజల్ట్ మరోలా ఉండేదని ఆయన వెల్లడించారు.రెబల్ సినిమా విడుదలకు ముందు తమ సినిమా కథ వేరు అని ఆయన పేర్కొన్నారు.

Telugu Dil Raju, Flop Result, Josh, Jr Ntr, Friend, Prabas, Rebel-Movie

కథ బాగా నచ్చడం వల్లే ఎన్టీఆర్, హరీష్, నేను ఆ కథను లాక్ చేసుకున్నామని దిల్ రాజు చెప్పుకొచ్చారు.రెబల్ సినిమా రిలీజైన తర్వాత ఫాదర్ కు అన్యాయం జరిగితే కొడుకు ప్రతీకారం తీర్చుకునే కథ కరెక్ట్ కాదని ఆ కథను వద్దని అనుకున్నామని దిల్ రాజు పేర్కొన్నారు.రామయ్యా వస్తావయ్యా విషయంలో రాంగ్ స్టెప్ వేశామని ఆయన అన్నారు.కథ మార్చడం పెద్ద తప్పు అని తర్వాత అర్థమైందని దిల్ రాజు తెలిపారు.

Telugu Dil Raju, Flop Result, Josh, Jr Ntr, Friend, Prabas, Rebel-Movie

సినిమా ఫ్లాప్ అయితే కథ, బడ్జెట్ వల్ల ఫ్లాప్ అవుతాయని దిల్ రాజు వెల్లడించారు. జోష్, ఓ మై ఫ్రెండ్ సినిమాలను అప్ కమింగ్ వాళ్లతో తీసి ఉంటే సక్సెస్ వచ్చేదని దిల్ రాజు అన్నారు.ఓ మై ఫ్రెండ్ కథ మంచి కథ అని బొమ్మరిల్లు హీరో కావడంతో ఆ సినిమా ఫ్లాప్ అయిందని దిల్ రాజు కామెంట్లు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube