సాధారణంగా కొందరికి జుట్టు తలపై కంటే ముఖంపైనే ఎక్కువగా పెరుగుతుంటుంది.తలపై జుట్టు అందాన్ని పెంచితే.
ముఖంపై జుట్టు అందాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుంది.అందుకే ముఖంపై ఏర్పడిన అవాంఛిత రోమాలను నివారించుకోవడం కోసం త్రెడ్డింగ్, షేవింగ్, లేజర్ ట్రీట్మెంట్ వంటి వాటిపై ఆధారపడుతూ వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.
కానీ, ఇంట్లోనే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని ట్రై చేస్తే గనుక.ఒక్క దెబ్బతోనే అవాంఛిత రోమాలను నివారించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.
తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండి, వన్ టేబుల్ స్పూన్ పటిక బెల్లం పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని కలుపుకోవాలి.
ఆ తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్, రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ల టమాటో జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు బాగా ఆరబెట్టుకోవాలి.ఆపై వేళ్లతో రుద్దుకుంటూ నార్మల్ వాటర్‌తో శుభ్రంగా ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.
అనంతరం తడి లేకుండా ముఖాన్ని టవల్‌తో తుడుచుకుని.స్కిన్‌కు సూట్ అయ్యే మంచి మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.
లేదా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి.ఇలా చేస్తే ముఖంపై ఏర్పడిన అవాంఛిత రోమాలు క్రమంగా తొలగిపోతాయి.
అంతే కాదు, పైన చెప్పిన రెమెడీని వారానికి ఒక సారి వేసుకుంటే.డెడ్ స్కిన్ సెల్స్ వదిలిపోయి స్కిన్ గ్లోయింగ్‌గా మరియు ఫ్రెష్‌గా మారుతుంది.
నలుపు లేదా గోధుమ రంగు మచ్చలు ఉన్నా.అవి తగ్గు ముఖం పడతాయి.
కాబట్టి, తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.