ఇటీవలే త్రిబుల్ ఆర్ సినిమా విడుదలై ఎంత బ్లాక్బస్టర్ హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దాదాపు వెయ్యి కోట్ల వసూళ్లను సాధించింది ఈ సినిమా.
అయితే ఈ సినిమాలో మా హీరో ని తక్కువ చేశారంటే మా హీరో ని తక్కువ చేశారు అంటూ సినిమా విడుదలైన నాటి నుంచి అభిమానుల మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంది.సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.
ఇలా అభిమానుల మధ్య ఘర్షణలు కేవలం ఇప్పుడే కాదు అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్నార్ కాలంలో కూడా జరిగేవటా.అప్పట్లో ఇండస్ట్రీకి రెండు కళ్లుగా ఎన్టీఆర్ ఏఎన్నార్ కొనసాగారు.
ఇద్దరికీ ఇండస్ట్రీలో అమితమైన గౌరవం ఉండేది.ఇక సినిమాని ఊపిరిగా బ్రతికారు ఇద్దరు.అయితే ఇక తెలుగు సినిమా స్థాయి పెరగడానికి కూడా ఇద్దరే కారణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఉన్న ఎన్టీఆర్ ఏఎన్నార్ మధ్య అప్పట్లో విపరీతమైన పోటీ ఉండేదట.
ఈ క్రమంలోనే అభిమానులు మరింత పోటీపడి మరీ కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.ఎన్టీఆర్ సినిమా హిట్ అయితే ఏఎన్ఆర్ సినిమా శతదినోత్సవం జరుపుకునే విధంగా విజయం సాధించేదట.
ఇలా ఒకరి సినిమా సిల్వర్ జూబ్లీ మరొకరి సినిమా గోల్డెన్ జూబ్లీ రికార్డులు సృష్టించేవి.వీరిద్దరి సినిమాల కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో ఉండేవి.
అభిమానుల మధ్య ఎంత ఘర్షణ ఉన్న ఇద్దరు హీరోలు పర్సనల్ లైఫ్ లో ఇద్దరు అన్నదమ్ముల్లా ఉండేవారు.
ఇక ఎన్నో సార్లు ఈ ఇద్దరు హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి అని చెప్పాలి.ఇక ఈ పోటీలో ఒకసారి ఎన్టీఆర్ గెలిస్తే మరొకసారి ఏఎన్నార్ సత్తా చాటారు.1967లో మొదటిసారి ఎన్టీఆర్ భువనసుందరి కథ, ఏఎన్ఆర్ గృహలక్ష్మి చిత్రాలు విడుదలయ్యాయి.ఏప్రిల్ 7 వ తేదీన ఒక రోజు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి.ఇక ఏఎన్ఆర్ గృహలక్ష్మి పరాజయం పాలు అయితే భువనసుందరి విజయం సాధించింది.
అదే ఏడాది ఆగస్టులో ఏ ఎన్ ఆర్ ఎన్టీఆర్ లు ఒకే రోజు పోటీపడ్డారు.నిండు మనసులతో ఎన్టీఆర్ వసంతసేన అనే జానపద చిత్రంతో ఏఎన్ఆర్ ప్రేక్షకుల ముందుకు రాగా రెండో సారి కూడా ఎన్టీఆర్ది పైచేయిగా నిలిచింది.
నిండు మనసులు సినిమా మంచి విజయం సాధించింది.ఇక అప్పటినుంచి హీరోల మధ్య పోటీ సర్వసాధారణమైపోయింది.బహుశా ఈ పోటీనే ఇప్పుడు సినిమా హీరోల వారసుల మధ్య కొనసాగుతుంది అంటూ ఉంటారు సినీ విశ్లేషకులు.