సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.ముఖ్యంగా జంతువులకు సంబందించిన వీడియోల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు.
ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఒక కోడి వీడియో బాగా వైరల్ గా మారింది.కోళ్లు అంటే మనకు సంక్రాతి పండగనే గుర్తుకు వస్తుంది కదా.ఎందుకంటే సంక్రాతి సంబరాల్లో కోడిపందాలు ఆడటం ఎప్పటినుంచో వస్తున్న ఒక సరద.సంక్రాతి వస్తుందంటే చాలు పందెం కోళ్లు బరిలోకి దిగడానికి రెడీ అయిపోతాయి.నువ్వా.నేనా.అన్నట్టు జరిగే ఈ కోడిపందాలను అందరు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తుంటారు.
అయితే వీడియోలో కనిపించే కోడిపుంజు మాత్రం కాస్త ప్రత్యేకం అనే చెప్పాలి.
ఎందుకంటే ఈ కోడిపుంజు ఏకంగా ఫుట్బాల్ ఆడేస్తుంది మరి.ఏంటి కోడిపుంజు మనుషుల వలె ఫుడ్ బాల్ ఆడడం ఏంటి అని షాక్ అవుతున్నారా.అసలు వివరాల్లోకి వెళితే.కేరళలో ఉంటున్న మిథున్ అనే ఆరో తరగతి చదివే విద్యార్థి ఇలా కోడిపుంజుతో ఫుట్ బాల్ ఆట ఆడిస్తున్నాడు.ఆ కోడిపుంజుకు మిథున్ ఒక పేరు కూడా పెట్టుకున్నాడు.ఆ కోడిపుంజును మిథున్ ముద్దుగా కుట్టప్పాన్ అని పిలుచుకుంటాడట.
మిథున్, కుట్టప్పాన్ ఇద్దరు కూడా మంచి స్నేహితుల్లగా కలిసి ఫుట్‌బాల్ ఆడుకోవడం మనం వీడియోలో చూడవచ్చు.
మిథున్ తో కలిసి ఎంచక్కా సైకిల్ పై రైడ్ కి కూడా వెళ్తోంది కుట్టప్పాన్.నిజానికి ఈ కోడిపుంజును మిథున్ కుటుంబం ఏడాదిన్నర క్రితం వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చారు.అలా ఆ కోడిపుంజుకు కుట్టప్పాన్ అని పేరు పెట్టి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.
అలా ఆ కోడిపుంజు ఆరెళ్ల మిథున్ కు కూడా బాగా అలవాటు అయిపొయింది.కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో మిథున్ ఇంట్లోనే ఉండడం వలన ఇద్దరి మధ్య అనుబంధం మరింత పెరిగినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.
మిధున్ తో పాటు సైకిల్ రైడ్ కు వెళ్తు ఫుడ్ బాల్ కూడా ఆడుతుంది ఈ కోడిపుంజు.మిథున్ కు ఒక స్నేహితుడిలా ఉంటూ తనకి రక్షణగా కూడా ఉంటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.