ఏపీ సీఎం వైఎస్ జగన్ దివంగత మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్నారు.నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమానికి వైసీపీ పార్టీ కీలక నాయకులు పలువురు మంత్రులు మరియు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.పొలిటికల్ గా తన ప్రతి అడుగులో గౌతంరెడ్డి తోడుగా ఉన్నారు అని చెప్పుకొచ్చారు.
ఎప్పుడు కూడా ప్రోత్సహించే రీతిలో తన వెన్నంటే గౌతంరెడ్డి ఉండేవాడని.గౌతమ్ రెడ్డిని తానే రాజకీయాల్లోకి తీసుకు వచ్చినట్లు జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రిగా గౌతంరెడ్డి 6 శాఖలను చూసేవారని తెలియజేశారు.రాష్ట్రానికి ఎప్పుడు కూడా ఎక్కువ పరిశ్రమలు తీసుకురావటానికి.
గౌతంరెడ్డి తెగ తాపత్రయ పడే వారని… పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని.అనే వారిని జగన్ తెలిపారు.
నిజంగా ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను.సంఘం బ్యారేజ్ కి కచ్చితంగా మేకపాటి గౌతం రెడ్డి పేరు పెడతామని జగన్ చెప్పుకొచ్చారు.
సంస్మరణ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ చాలా బావోద్వేగానికి గురయ్యారు.