యాదాద్రిపై సీడీని ఆవిష్కరించిన ఎర్రబెల్లి

యాదాద్రి భువనగిరి జిల్లా:శ్రీ లక్ష్మినరసింహస్వామి వైభవాన్ని ప్రపంచంలో నలు దిక్కులా చాటేలా సీఎం కేసీఆర్ దీక్ష,కృషి సంకల్పంతో యాదాద్రి ఆలయాన్ని పునఃనిర్మించారని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి,గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.ఆదివారం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోనున్న మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో ఆర్.

 Errabelli, Who Unveiled The Cd On Yadadri-TeluguStop.com

ఆర్.ఆర్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్ వారు యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వైభవాన్ని ప్రతిబింబించే విధంగా వీడియో సిడిని ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ యాదాద్రి ఆలయ,స్వామి వారి వైభవాన్ని చాటిచెప్పేలా సీడీని రూపొందించడం అభినందనీయమని అన్నారు.యాదాద్రి పునఃనిర్మాణ చరిత్రను తెలుసుకోవడానికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

యాదాద్రి పునఃనిర్మాణంతో శ్రీ లక్ష్మి నరసింహాస్వామి దర్శనానికి కౌంట్ డౌన్ ప్రారంభమైయ్యిందని,రేపు ఉదయం శుభ ముహర్తంలో మహా కుంభ సంప్రోక్షణ అనంతరం కోట్లాది మంది కొంగు బంగారమైన శ్రీ లక్ష్మినరసింహాస్వామి ప్రధానాలయ ద్వారాలు తెరుచుకుంటయన్నారు.సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుండి భక్తుల దర్శనాలు తిరిగి ప్రారంభం అవుతాయన్నారు.

పునఃనిర్మాణం తర్వాత యాదాద్రి ఆలయాన్ని సందర్శిస్తే ఆధ్యాత్మిక సాగరంలో మునిగిపోవడం ఖాయమని,అంత రమణీయంగా,ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ముఖ్య మంత్రి కేసీఆర్ పునఃనిర్మించారని ఆయన అన్నారు.ఎక్కడ రాజీ పడకుండా,తొందర పడకుండా,దీక్షగా ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పునఃనిర్మించారని అన్నారు.

ప్రజలకు వెయ్యేళ్ళ పాటు గుర్తించుకోనేలా పాలించడం పాలకుల ప్రధాన లక్ష్యమని యాదాద్రి ఆలయాన్ని పూర్తి చేసిన కేసీఆర్ పేరు కూడా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి పోతుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube