ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో క్రేజీ కాంబినేషన్స్ నేపథ్యంలో సినిమాలు రాబోతున్నాయి.వీటికి సంబంధించిన ప్రకటనలు చేశారు దర్శక నిర్మాతలు.
దీంతో ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు షూటింగ్ ప్రారంభం అవుతుందా అని అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే మాత్రం ఈ క్రేజీ కాంబినేషన్స్ కు సంబంధించిన ప్రకటన వచ్చినప్పటికీ చివరికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం మాత్రం లేట్ అయ్యే అవకాశం ఉంది అని తెలుస్తుంది.
ఇక ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం.
ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.
సినిమా ముగిసిన వెంటనే త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడు.సినిమా ప్రకటన కూడా వచ్చేస్తుంది.అయితే మరో పది రోజుల్లో షూటింగ్ ప్రారంభం అవుతుందని అనుకున్నారు.కానీ నెక్స్ట్ మంత్ ఫ్యామిలీతో వెకేషన్ వెళ్తున్నాడు మహేష్.
దీంతో ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది.
పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బన్నీ ఇక పుష్ప 2 సినిమా వెంటనే ప్రారంభించాలని అనుకున్నారు.
ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ ఇప్పట్లో షూటింగ్ ప్రారంభం అయ్యేలా మాత్రం అస్సలు కనిపించడం లేదు.ఈ క్రమంలోనే ఇక ఈ సినిమా కూడా షూటింగ్ ప్రారంభించేందుకు కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందట.
త్రిబుల్ ఆర్ సినిమా సైన్ చేసినప్పటి నుంచి మరో సినిమా చేయడానికి ముందుకు వెళ్ళని ఎన్టీఆర్ ఇక ఇటీవల కొరటాల శివతో సినిమాకు రెడీ అయ్యాడు.అయితే ఇక ప్రస్తుతం ఈ సినిమా కూడా లేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ఎందుకంటే ప్రస్తుతం ఆచార్య నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతుండడంతో కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ పట్టాలెక్కడం కాస్త టైం పట్టే అవకాశం ఉంది.
గబ్బర్ సింగ్ తో ప్రేక్షకులందరికీ ఫేవరెట్ జోడి గా మారిపోయిన హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాతో రిపీట్ కావాల్సి ఉంది.కానీ ఏ సినిమా కూడా ఇప్పట్లో సెట్స్ మీదికి వచ్చే అవకాశం లేదు అనేది తెలుస్తుంది.ఇక నెక్స్ట్ మంత్ లో హరిహర వీరమల్లు షూటింగ్ ప్రారంభం కాబోతున్నది.
శేఖర్ కమ్ముల ధనుష్ కాంబినేషన్లు ఒక సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని అందరూ అనుకున్నారు కానీ ఈ సినిమా కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.వీటితో పాటు అనిల్ రావిపూడి బాలయ్య కాంబినేషన్ లో కామెడీ ఎంటర్ టైన్ మెంట్ మూవీ, ఇక బన్నీ వేణు శ్రీరామ్ ఐకాన్ సినిమాలు కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది.