స్వాతంత్ర నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది మీకు తెలుసా?

సాధారణంగా బ్రిటిష్ కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.ఇక ఇలా స్వాతంత్ర సమరయోధుల కాన్సెప్టుతో తెర మీదికి వచ్చిన సినిమాల విషయంలో ఎన్నో రోజుల నుంచి ఒక బాడ్ సెంటిమెంట్ కొనసాగుతూ ఉంది.

 Periodical Movie Sentiment In Tollywood Details, Periodical Movie, Flop Movies,-TeluguStop.com

ఇలాంటి సినిమాలపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ చివరికి విడుదలైన తర్వాత మొత్తం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక యావరేజ్ టాక్ సొంతం చేసుకోవడం లేదా ఫ్లాప్ కావడం లాంటివి జరుగుతూ ఉంటాయ్.ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి.

వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

విక్టరీ వెంకటేష్ నటించిన సుభాష్ చంద్రబోస్ సినిమా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కింది.1946 ఫ్రీ ఇండిపెండెన్స్ నేపథ్యంలో సాగిన ఈ కథలో వెంకీ మామ ద్విపాత్రాభినయం చేశారు.కానీ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని అందించలేకపోయింది.

చివరికి డిజాస్టర్ గా నిలిచింది.ఇదే పంథాలో వచ్చిన సినిమా ఒక్కమగాడు.2008లో వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కాస్త చివరికి ఫలితం రాబట్టలేదు.కమల్ హాసన్- శంకర్ భారతీయుడు మూవీ ని కాపీ చేశారన్న విమర్శలు కూడా మూటగట్టుకుంది.

Telugu Bharatiyudu, Chiranjeevi, Flop, Mangal Panday, Manikarnika, Nagarjuna, Ok

తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా రాజన్న. నిజాం పాలనలో విముక్తి కోసం జరిగిన పోరాట నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.ఇక ఈ సినిమాలో నాగార్జున పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉన్నప్పటికీ ఎందుకో ఈ సినిమా కమర్షియల్గా మాత్రం విజయం సాధించలేకపోయింది.నాగార్జున హీరో అని చెప్పినప్పటికీ కేవలం ఒక అతిథి పాత్రలాగా మాత్రమే కొంత సమయం కనిపిస్తు ఉంటాడు.

Telugu Bharatiyudu, Chiranjeevi, Flop, Mangal Panday, Manikarnika, Nagarjuna, Ok

ఇక ఇదే తరహాలో అటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా మంచి ఫలితాన్ని రాబట్టలేకపోయింది.ఈ సినిమాలో చిరంజీవితో పాటు అమితాబచ్చన్ లాంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ హిట్ అవ్వలేదు.ఇక పవన్ కళ్యాణ్ తమిళనాడులో కమల్ హాసన్ కు మలయాళంలో మోహన్ లాల్ కన్నడలో ఈ సినిమా కథను పరిచయం చేస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చారు.కంగనా నటించిన మణికర్ణిక అమీర్ ఖాన్ నటించిన మంగల్ పాండే సినిమాలు సైతం నిరాశ పరిచాయ్ అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube