డాక్టర్ బాబుకు భార్యతో మరోసారి పెళ్లి చేసిన మల్లెమల.. నెట్టింట్లో వీడియో వైరల్!

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అందరికీ తెలిసిందే.ఇక ఈ సీరియల్ తో ప్రేక్షకులకు ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 Mallemala Remarries To The Doctor Babu And His Wife Video Goes Viral On Social M-TeluguStop.com

సెలబ్రెటీలు కూడా ఈ సీరియల్ కు ఎంతలా వాలిపోయారో చూస్తూనే ఉన్నాం.ఇందులో నటించే కార్తీక్, దీప, సౌందర్య, మోనిత పాత్రలకు బాగా ఆకర్షితులయ్యారు.

ఇక వీరి గురించి ఏ వార్త వచ్చిన సరే వెంటనే నెట్టింట్లో వైరల్ గా మారుతుంది.ఇక ఇందులో ఎక్కువగా డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలకు విపరిమితమైన ఫాలోయింగ్ ఉంది.

ఈ సీరియల్ తో బుల్లితెర స్టార్ గా మారిన డాక్టర్ బాబు అసలు పేరు నిరూపమ్. తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అంతేకాకుండా ప్రస్తుతం హిట్లర్ గారి పెళ్ళాం అనే మరో సీరియల్ లో కూడా నటిస్తున్నాడు.

ఈ సీరియల్ కూడా నిరూపమ్ కు మంచి గుర్తింపు అందిస్తుంది.

ఈయన భార్య బుల్లితెర నటి మంజుల గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఆమె కూడా పలు సీరియల్స్ లో బాగా బిజీగా ఉంది.

వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.డాక్టర్ బాబు.

కార్తీకదీపం సీరియల్ కంటే ముందు ఎన్నో సీరియల్స్ లో నటించాడు.కానీ ఆయన కెరీర్ కు మలుపు తిరిగిన సీరియల్ అంటే కార్తీకదీపం అనే చెప్పాలి.

అల్లరి సీరియల్ తో బుల్లితెర శోభన్ బాబు గా పేరు సంపాదించుకున్నాడు.మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇక ఈ సీరియల్ తో పాటు మరిన్ని సీరియల్స్ లో అవకాశాలు రాగా డేట్స్ కుదరకపోవడంతో వదులుకున్నాడు.పైగా వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా వదులుకున్నాడు.

అప్పుడప్పుడు బుల్లితెరపై జరిగే ఈవెంట్ లో పాల్గొని బాగా సందడి చేస్తుంటాడు.

Telugu Babu, Mallemala, Manjula, Marrige, Nirupam-Movie

అలా తెరపై ఆయన రోజు సంపాదన రూ.60 వేలకు పైగా ఉంటుందట.దీనిని బట్టి నెలకు రూ.14 లక్షలకు పైగానే సంపాదిస్తాడు నిరూపమ్.ఇక వైజాగ్ లో రూ.5 కోట్ల విలువ చేసే ప్రాపర్టీ, హైదరాబాద్ లో శ్రీనగర్ కాలనీలో రూ.80 లక్షలు విలువ చేసే ప్లాటు ఉన్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.అంతేకాకుండా రూ.11 లక్షల విలువచేసే రెండు కార్లు కూడా ఉన్నాయి.ఇక ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.

Telugu Babu, Mallemala, Manjula, Marrige, Nirupam-Movie

తనకు సంబంధించిన ఫోటోలను, కొన్ని విషయాలను బాగా షేర్ చేసుకుంటాడు.సోషల్ మీడియాలో కూడా ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇదిలా ఉంటే తాజాగా ఆయనకు ఈటీవి మల్లెమాల ప్రొడక్షన్ తన భార్య తో మరోసారి పెళ్లి జరిపించారు.

ఆ వేడుకలో జబర్దస్త్ తో పాటు మరికొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు.ఇక దీనికి సంబంధించిన వీడియోను మంజుల పరిటాలా షేర్ చేసుకోగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube