సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా.మాకు సంబంధమే లేదు మేము పట్టించుకోము మేము సినిమాలు తీస్తూనే ఉంటాం.
మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాం.అంటూ వరసగా సినిమాలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్త హీరోలు.
ఒక సినిమా తీయడానికి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఉంటే చాలు.ఫ్లాప్స్, హిట్స్ తో అసలు సంబంధంలేదని కొంతమంది హీరోలు దూసుకెళ్తున్నారు.
వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.
ఈ లిస్ట్ లో మాస్ కా దాస్ విష్వక్ సేన్ ముందు వరుసలో ఉంటాడు.
తన సినిమాల రిజల్ట్ ని పక్కన పెట్టి వరసగా సినిమాలు చేస్తున్నాడు.పాగల్ సినిమాతో ఫ్లాప్ ఫేస్ చేసిన విష్వక్.
లేటెస్ట్ గా దాస్ గా దమ్కీ అనే ఇంకొక కొత్త సినిమాని అనౌన్స్ చేశారు.ఈ సినిమాలతో పాటు అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది.
పోయిన ఏడాది ఎస్.ఆర్ కళ్యాణమండపం అంటూ హిట్ కొట్టిన హీరో కిరణ్ అబ్బవరం.కూడా ఇప్పుడు ఫామ్ లోనే ఉన్నాడు.అయితే మొన్నీమధ్య వచ్చిన సెబాస్టియన్ పిసి 524తో తన లైఫ్ లో ఫస్ట్ టైం ప్లాప్ ఫేజ్ చూసాడు.అయినా సరే వరసగా సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.సమ్మతమే, నేను మీకు బాగా కావల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణుకథ అనే క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు కిరణ్ అబ్బవరం.
ఇక సాయికుమార్ గారి కొడుకు హీరో ఆది హిట్ అన్న మాట విని కొన్ని సంవత్సరాలు అయిపోయింది.అయినప్పటికీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఆదిసాయికుమార్.పోయినేడాది శశి, ఈ సంవత్సరం అతిధి దేవో భవ సినిమాలతో ఫ్లాప్స్ వచ్చినా కూడా ఆది అన్న అస్సలు తగ్గట్లే.ప్రజెంట్ జంగిల్, కిరాతక, సిఎస్ఐ సనాతన్, బ్లాక్.
ఇలా 4,5 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఆది సాయికుమార్.ఇక పూరి జగన్నాథ్ గారి కొడుకు ఆకాష్ పూరి కూడా ప్రెసెంట్ ఫాం లోనే ఉన్నాడు ఈ మధ్య వచ్చిన రొమాంటిక్ మూవీ అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.
అయినప్పటికీ ఎక్కడ తగ్గకుండా సినిమాలు నిర్మిస్తూనే ఉన్నాడు ఇప్పుడు చోర్ బజార్ అంటూ త్వరలో మన ముందుకు రాబోతున్నాడు.
ఇక నిర్మలా కాన్వెంట్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ కూడా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు.రియల్ ఫ్యామిలీ లవ్ స్టొరీ గా తెరకెక్కిన పెళ్లిసందడి ఇటీవలే విడుదలై అనుకున్నంత సక్సెస్ కాలేదు.అయినప్పటికీ ఈ మధ్యనే వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్లో ఒకం కొత్త సినిమా అనౌన్స్ చేశారు.
ఈ సినిమాకి ప్రదీప్ అద్వైతం డైరెక్టర్.
మత్తు వదలరా అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరో శ్రీసింహ.కీరవాణి గారి అబ్బాయి అని అందరికీ తెలుసు.అయితే కీరవాణి గారి అబ్బాయి అయినప్పటికీ ఆల్మోస్ట్ ఆయన సహాయ సహకారాలు ఏమి లేకుండానే హీరోగా నిలదొక్కుకోవాలి అని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు.
లాస్ట్ ఇయర్ తెల్లవారితే గురువారం అనే సినిమా నిరాశ పరిచినప్పటికీ ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్ సంస్థ ద్వారా దొంగలున్నారు జాగ్రత్త అనే క్రేజీ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.