న్యూయార్క్ : హోలీ వేడుకలకు సిద్ధమైన ప్రవాస భారతీయులు.. భారీగా ఏర్పాట్లు

హోలీ’ వస్తుందంటే చాలు.దేశమంతా పండుగే.

 Puppet Show On Lord Krishna, Indian Dance Workshops To Be Among Highlights Of Sp-TeluguStop.com

దీపావళి తర్వాత చిన్నా, పెద్దా, ముసలి, ముతకా అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ కూడా ఒకటి.సత్య యుగం నుంచి హోలీ పర్వదినాన్ని జరుపుకుంటున్నట్లు పురాణాలు తెలుపుతున్నాయి.

హోలీని ‘హోళికా పుర్ణిమ’గా కూడా వ్యవహరిస్తారు.ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను.

హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని రకరకాల పేర్లతో పిలుస్తారు.ఈ పండుగ పుట్టుపుర్వోత్తరాల గురించి పురాణాల్లో భిన్నగాథలు ప్రచారంలో ఉన్నాయి.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు.హోలీ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు.

తద్వారా మనదేశంలో జరుపుకునే రోజే దాదాపు అన్ని దేశాల వారు హోలీని జరుపుకుంటున్నారు.ఇక మనకు మరో ఇల్లుగా మారిన అమెరికా సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అక్కడి అన్ని ప్రధాన నగరాల్లోనూ హోలీని రంగ రంగ వైభవంగా నిర్వహిస్తారు.

ఈ ఏడాది కూడా అమెరికాలో హోలీ వేడుకలకు సర్వం సిద్ధమయ్యాయి.

న్యూయార్క్‌కు చెందిన ది కల్చర్ ట్రీ అనే సాంస్కృతిక సంస్థ.భారతీయ రంగుల పండుగను పురస్కరించుకుని ఇక్కడి ప్రవాసులకు అవగాహన కల్పించేందుకు తోలుబొమ్మల ప్రదర్శన, కళా కార్యకలాపాలు, భారతీయ సాంప్రదాయ నృత్య వర్క్‌షాప్‌‌లను ఏర్పాటు చేసింది.

దక్షిణాసియాకు చెందిన సాంస్కృతిక అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యంతో కల్చర్ ట్రీ… ది సీపోర్ట్ భాగస్వామ్యంతో మార్చి 19న హోలీ సందర్భంగా ప్రత్యేక వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

ది కల్చర్ ట్రీ వ్యవస్థాపకురాలు అను సెహగల్ మాట్లాడుతూ.

ఒక సాంస్కృతిక అధ్యాపకురాలిగా, పిల్లలకు ప్రామాణికమైన, స్పూర్తిదాయకమైన అనుభవాలను అందించడానికి తాను ఎల్లప్పుడూ ఎదురుచూస్తున్నానని తెలిపారు.ఇలాంటి ఈవెంట్‌ల ద్వారా ప్రవాస కమ్యూనిటీ పిల్లలకు వారి కుటుంబాలు.

భారతీయ వారసత్వంతో కనెక్ట్ అవ్వడానికి మార్గాలను అందిస్తామన్నారు.

Telugu Holi America, Indiandance, Krishnas Love, Enterprise, Puppetshow, Tree-Te

మైనారిటీ ఉమెన్ బిజినెస్ ఎంటర్‌ప్రైజ్ (ఎండబ్ల్యూబీఈ) సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ అయిన కల్చర్ ట్రీ.హోలీ రోజున ‘‘కృష్ణాస్ లవ్’’ పేరిట తోలుబొమ్మల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు.ఈ సందర్భంగా కృష్ణుని చిన్ననాటి ఆటలు, చేష్టలను చూపిస్తామని అను తెలిపారు.

రాధ, సుదామతో సహా అతని స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా తోలు బొమ్మలాట సందర్భంగా ప్రదర్శిస్తామని ఆమె చెప్పారు.అలాగే తోలు బొమ్మల తయారీ వర్క్‌షాప్ కూడా వుంటుందని.

ప్రదర్శనలోని పాత్రల ఆధారంగా పిల్లలు సొంతంగా తోలుబొమ్మలను తయారు చేసుకునే అవకాశం వుంటుంది.దీనితో పాటు బాలీవుడ్, జానపద పాటలతో నృత్య ప్రదర్శన వుంటుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube