ఇంటర్నెట్‌లో సందడి చేస్తున్న పుతిన్ డూప్లికేట్!

రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది.రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా అయ్యారు.

 Meet Russian President Vladimir Putin Secret Child , Russia-ukraine, Putin, Vla-TeluguStop.com

రష్యాలో గత 22 ఏళ్లుగా పుతిన్ అధికార పగ్గాలు చేపట్టారు.ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకులలో పుతిన్ ఒకరు.

పుతిన్ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకోవాలని చాలామంది కోరుకుంటున్నారు.ఇప్పుడు పుతిన్ రూపాన్ని పోలిన యువతి గురించి తెలుసుకుందాం.

ఆ యువతి పేరు లూయిజ్ రోసోవా.లూయిజ్.

పుతిన్ స్వస్థలమైన సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఉంటున్నారు.రష్యా మీడియా ఆమెను.

పుతిన్ రహస్య కుమార్తెగా చెబుతుంటుంది.రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న ప్రస్తుత సమయంలో లూయిజ్ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

రష్యా అధ్యక్షుడి పోలికలతో కనిపించడం వల్ల సోషల్ మీడియాలో ఆమె ట్రోల్‌కు గురవుతుతోంది.లూయిజ్ ప్రస్తుతం చదువుకుంటోంది.

లూయిజ్.స్వెత్లానా క్రివోనోగిఖ్ కుమార్తె, స్వెత్లానాను వ్లాదిమిర్ పుతిన్ స్నేహితురాలు అని అంటారు.

45 ఏళ్ల స్వెత్లానా వృత్తిరీత్యా క్లీనర్.కానీ ఇప్పుడు ఆమె మల్టీ మిలియనీర్ వ్యాపారవేత్తగా మారింది.

ఆమె ప్రస్తుతం రష్యన్ బ్యాంక్‌లో భాగస్వామి.లూయిజ్ ముఖం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను పోలి ఉన్నప్పటికీ, లూయిజ్ తల్లి స్వెత్లానా దీనిపై ఎప్పుడూ స్పందించలేదు.

లూయిజ్ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నదని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.లూయిజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.

ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 84 వేల మందికి పైగా ఫాలోవర్లు కూడా ఉన్నారు.లూయిజ్ పుతిన్ కూతురేనా అని ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి, అయితే రష్యా అధ్యక్షుడు కూడా ఈ విషయమై ఎప్పుడూ తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు.

అయితే, స్వెత్లానా ఒకసారి దానిపై వ్యాఖ్యానిస్తూ.లూయిజ్ యంగ్ పుతిన్ లాగా ఉండవచ్చని తెలిపింది.

కాగా లూయిజ్‌ను ఈ విధంగా ట్రోల్ చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు.లూయిజ్‌ను ఈ విధంగా తీర్మానించకూడదని వారంటున్నారు.

దీనిలో లూయిజ్ తప్పు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.కాగా లూయిజ్ కూడా దీనిపై ఏవిధంగానూ స్పందించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube