సినిమా ఇండస్ట్రీ పరంగానే కాకుండా, రాజకీయాల్లో అరంగేట్రం చేసిన ఆయన స్టార్‌డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన పేరులోనే పాజిటివ్ వైబ్రేషన్స్ అంతలా ఉంటాయి.
ఆయన మాట్లడే తీరు, సభల్లో చేసిన ప్రసంగాలు అందరిని ఆకట్టుకుంటాయి.ఆయన నడవడిక యువతరానికి ఆదర్శంగా నిలుస్తాయి.
అందుకే ఆ పేరు వింటేనే యువత పరుగులు పెడుతుంది.అంతే ఉత్తేజంతో ఉరకలేస్తుంది.
ఆయన మాట్లాడినంత సేపు అనువనువు చలిస్తుంది.అంతకుమించి ప్రజాకర్షణ ఆయన సొంతం.
తనది ఎనిమిదేండ్ల రాజకీయ జీవితం అంటూనే మరో పాతికేళ్లకు పైగా రాజకీయాల్లో నిలబడతానని తెగేసి చెప్పుకొచ్చే సత్తా పవన్‌కు ఉందనడంలో సందేహం లేదు.
రాజకీయాల్లో అరంగేట్రం చేసిన తొలినాళ్లలో ఏపీ రాజకీయాలపై చేసిన ప్రసంగాలు, మాటల తూటాలు ఎలా ప్రేరేపించాయో అందరికి తెలుసు.ఆచరణలోనూ ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తారు కూడా.ఏదైనా ఒకటి తలిస్తే అది సాధించే వరకు ఒకటికి పదిసార్లు నెమరు వేసుకోవడం ఆయన సొంతం.
దీనికి తోడు ఆయనకు బలమైన యువసైన్యం ఉంది.వారి దూకుడును అరికట్టడం అంటే నరకయాతన అనే చెప్పొచ్చు.
జనసైనికులు కూడా పవన్ డైరెక్షన్‌లోనే నడుస్తుంటారు.సాధారణంగా యువత దూకుడును ఆపడం ఎవరి సాధ్యం కాదు.
కానీ, పవన్ అనే పదం వింటే వారిని అలా స్థిరంగా నిలబెడతాయి.ఆయనవెంట నడిచే లక్షలాదిమంది జనసైనికులే పవన్కు అసలుసిసలైన బలం.
అయితే ఏపీ రాజకీయాల్లో నాటి కంటే నేటి వరకు రాజకీయాలు అవపోషణ పట్టారు.ఎలాంటి తడబాటుకు గానీ, పొరబాటు చేయడంలో గానీ అవకాశం లేకుండా చూసుకుంటు ముందుకుసాగుతున్నారు .ఏపీలో అధికార పీఠం దక్కించుకోవాలంటే అందుకు కావాల్సిన అన్నింటిని సమకూర్చుకోవడం కూడా పవన్‌కు తెలుసనే చెప్పాలి.అందుకే తనకు తానుగా ఎదుగుతూ, ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
వేసే ప్రతి అడుగు అభివృద్ధి చెందేలా చూసుకుంటున్నాడు.ఆయన భావాలు కూడా మనసులో ఆలోచనలు ప్రజ్వరింపజేస్తాయి.
అందుకే మార్పు కోసం యుద్దం చేయాల్సి వస్తే 100కు 99శాతం శాంతిని కోరుకుంటానని చెబుతూనే మరోవైపు వందోసారి కూడా యుద్దం చేయాల్సి వస్తే యుద్ధానికి సై అని పవన్ అంటున్నాడు.ఇది చర్చనీయాంశంగా మారుతోంది.
అనివార్యంగా పవన్ యుద్దం మొదలు పెడితె .జనసైనికుల దూకుడుకు కల్లెం వేయడం ఎవరి సాధ్యం అనే ప్రశ్న తలెత్తక మానదు.అయితే సభల్లోనే ఆవేశం కనబడుతుందని, ఆ తరువాత శాంతిస్వరూపుడేనని విమర్శిస్తున్నా….పవన్ స్టామినా ఏంటో ఇంకా తెలియడం లేదా అనిపిస్తుంది.ఒకవేళ రాజకీయ యుద్దం పవన్ చేపడితే వచ్చే మార్పులు తట్టుకోగలరా ?.అంటూ జనసైనికులు సై అంటున్నారు.రానురాను ఏపీ రాజకీయాల్లో పవన్ దూకుడు పెరిగేనా ? అంటే వేచి చూడాల్సిందే.