జ‌గ‌న్ అంటేనే ప‌థ‌కాలు... అయినా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ లేదా ?

జ‌గ‌న‌న్న అమ్మ ఒడి, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ పెన్ష‌న్ కానుక‌, వైఎస్సార్ కాపు నేస్తం, పేద‌ల‌కు ఇండ్లు, జ‌గ‌న‌న్న చేదోడు, వైఎస్సార్ నేత‌న్న‌, నేస్తం జ‌గ‌న‌న్న‌, విద్యాదీవెన‌, వ‌స‌తి దీవెన‌, వైఎస్సార్ రైతు భ‌రోసా, వైఎస్సాఆర్ వాహ‌న మిత్ర… ఇవ‌న్నీ ఏపీ సీఎం జ‌గ‌న్ అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన నాటి నుంచి నేటి వ‌ర‌కు తీసుకొచ్చిన సంక్షేమ ప‌థ‌కాలు.వీటిని అమ‌లు చేయ‌డంలో వైసీపీ ప్ర‌భుత్వం కొత్త చ‌రిత్ర సృష్టించింద‌న‌డంలో సందేహం లేదు.

 Jagan Means Schemes  But No Positive Feedback , Ysjaganmohanreddy, Ap Cm-TeluguStop.com

జ‌గ‌న్ అన్ని ర‌కాల వ‌ర్గాల‌ను ఆదు కునేందుకు స‌క‌ల ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.గ్రామ స‌చివాల‌యాల్లో కూడా జాబితా పెడుతున్నారు.

రాష్ట్ర ఖ‌జానా ఖాళీ అవుతున్నా అప్పులు చేసి మ‌రీ సొమ్మును ప‌థ‌కాల‌కు మ‌ళ్లిస్తున్న ప‌రిస్థితి.ప్ర‌తి ప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నా, బ్యాంకులు అప్పులు ఇవ్వ‌లేమంటు తేగేసి చెబుతున్నా జ‌గ‌న్ లెక్క‌చేయ‌ట్లేదు.

ఏదోర‌కంగా నిధులు తీసుకొచ్చి ప‌థ‌కాల‌కు వెచ్చిస్తున్న‌ట్టు స‌మాచారం.మేనిఫెస్టోలోని ప‌థ‌కాల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా కొన‌సాగించి తీరుతాన‌ని ఇటీవ‌ల జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.

కాగా సంక్షేమ ప‌థ‌కాల పేరుతో ప్ర‌జ‌ల‌కు ఇస్తున్న సొమ్ము విష‌యం ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు, గ్రామ‌వాలంటీర్ల‌కు మాత్ర‌మే తెలుస్తోంది.మిగ‌తా పార్టీ లోని కీల‌క నేత‌ల‌కు గానీ, క్యాడ‌ర్‌కు గానీ తెల‌య‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

దీంతో క్ష‌త్ర‌స్థాయిలో ప‌థ‌కాలు ఎవ‌రి అందు తున్నాయి ? ఎవ‌రి అంద‌ట్లేదు ? అనే విష‌యాలు వీరికి తెల‌య‌ట్లేదు.ఇది వైసీపీకి ఇబ్బందులు తెచ్చిపెడుతోంద‌ని స‌మాచారం.

క్యాడ‌ర్‌కు స‌మాచారం ఇస్తే వారు ప‌థ‌కాల‌పై ప్ర‌చారం చేసే వీలుంటుంది.ఇది లేక‌ పోవ‌డంతో జ‌గ‌న్‌కు ప‌థ‌కాల ప‌ట్ల పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావ‌ట్లేద‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు ప‌థ‌కాలు తీసుకున్న వారు కూడా గ‌మ్మున ఉండ‌డంతో, ప‌థ‌కాలు రాని వారు అన‌ర్హులు. వైపీపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

పార్టీ లోక‌ల్ లీడ‌ర్లు కూడా పథ‌కాల స‌మాచారం ఇవ్వ‌రా అంటూ మండి ప‌డుతున్న ప‌రిస్థితి.

గ్రామాల విష‌యాని కొస్తే ర‌చ్చ‌బండ‌ల వ‌ద్ద ఇది పెద్ద చ‌ర్చ‌గా మారుతోంది.జ‌గ‌న్ ఎన్ని ప‌థ‌కాలు అమ‌లు చేస్తే ఏం లాభం ? ఊర్లో క‌నీసం రోడ్లు కూడా వేయ‌రా ? అంటూ ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం.జ‌గ‌న్ పాల‌న‌లో ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకు రాలేద‌ని, పాత ప్రాజెక్టును కూడా పూర్తి చేయ‌ లేదంటూ విమ‌ర్శ‌ల అస్త్రాలు ప్ర‌యోగిస్తున్న పరిస్థితి.

ఇవ‌న్నీ జ‌గ‌న్ ప‌థ‌కాల ప‌ట్ల పాజిటివ్ టాక్ రాక‌పోగా నెగెటివ్ టాక్ వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.ఇలానే కొన‌సాగితే భ‌విష్య‌త్‌లో ఎలాంటి ఫీడ్ బ్యాక్‌ల‌ను వైసీపీ ఎదుర్కుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube