రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఝుమ్మందినాదం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి తాప్సి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ విధంగా తెలుగులో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు పయనించారు.
ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో కమర్షియల్ చిత్రాలు, లేడీ ఓరియంటెడ్ చిత్రాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తాప్సీ ప్రస్తుతం ఏకంగా ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు.ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
తాజాగా తాప్సీ నటించిన చిత్రం ‘లూప్ లపేట’.ఇది 1998లో తెరకెక్కిన జర్మన్ మూవీ ‘రన్ లోలా రన్’ అనే చిత్రానికి రీమేక్.
ఈ చిత్ర నిర్మాణ సమయంలో తనకు దర్శకుడి నుంచి చేదు అనుభవం ఎదురైందని ఈ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.ఈ సినిమాలో ఓ ముద్దు సన్నివేశం గురించి డైరెక్టర్ బ్యాగ్రౌండ్ వాయిస్ ఇచ్చారని ఈ క్రమంలోనే తనకు డైరెక్టర్ పై చాలా కోపం వచ్చిందని ఆ సంఘటన గురించి ఈ ఇంటర్వ్యూ ద్వారా తాప్సీ తెలియజేశారు.
ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ…నటుడు తాహిర్ తనకు మధ్య ఒక రొమాంటిక్ కిస్ సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది.అయితే డైరెక్టర్ మా ఇద్దరి చేతులను ఒకరికొకరు హోల్డ్ చేసుకోండి ఇప్పుడు ముద్దు పెట్టుకోండి అని చెప్పారు.ఈ ముద్దు ఎలా ఉండాలంటే స్విచ్ ఆన్ ఆఫ్ చేసినట్టు ఉండాలి అంటూ చెప్పారు.ఇలా చెప్పిన వెంటనే డైరెక్టర్ ఆకాష్ కామెంట్స్ మధ్యలో శృతి మించి పోయాయి.
ఈ క్రమంలోనే ఆయన గట్టిగా అరుస్తూ తాహిర్ ఇలాంటి అమ్మాయితో ఇప్పటివరకు ఇలాంటి సీన్లలో నటించి ఉండవు ఇదే అవకాశం గట్టిగా ముద్దు పెట్టుకో అంటూ మాట్లాడారు.
ఈ విధంగా ఆ డైరెక్టర్ మాట్లాడటంతో నాకు ఒళ్ళు మండిపోయింది.ఇలా మధ్యలో నుంచి వెళ్లిపోయి అసలు ఏం మాట్లాడుతున్నావ్ అంటూ డైరెక్టర్ పై గట్టిగా అరిచాను అని ఈ సందర్భంగా తాప్సీ తెలియజేశారు.అయితే ఒక్కసారిగా ఆ డైరెక్టర్ ఇలాంటి చీప్ కామెంట్ చేయడంతో చాలా బాధేసిందని అందుకే తన పై ఆగ్రహం వ్యక్తం చేశానని నా మాటలు తనని చాలా బాధ పెట్టాయని తాప్సి తెలియజేశారు.
ఇలా డైరెక్టర్ పై గట్టిగా అరిచిన తర్వాత కాసేపటికి తిరిగి ఆ సీన్ లో నటించానని ఈ సందర్భంగా ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి తాప్సీ బయటపెట్టారు.