భార్యను పరిచయం చేసి షాకిచ్చిన నవీన్ చంద్ర.. క్యూట్ కపుల్ అంటూ?

తెలుగులో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నవీన్ చంద్ర తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే.ఈ యంగ్ హీరోకు భారీస్థాయిలో అభిమానులు ఉన్నారు.

 Actor Naveen Chandra Wife Photo Goes Viral In Social Media , Goes Viral, Interes-TeluguStop.com

తెలుగుతో పాటు తమిళ సినిమాలలో కూడా నటిస్తూ నవీన్ చంద్ర సినిమాసినిమాకు క్రేజ్ ను పెంచుకుంటున్నారు.తెలుగులో అందాల రాక్షసి సినిమాతో నవీన్ చంద్రకు నటుడిగా మంచి గుర్తింపు దక్కింది.

కర్ణాటకలోని బళ్లారిలో జన్మించిన నవీన్ చంద్ర గత పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు.

నేను లోకల్, అరవింద సమేత వీర రాఘవ సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి నవీన్ చంద్ర సత్తా చాటారు.

అయితే ఈ నటుడు తాజాగా తన భార్యను పరిచయం చేసి అభిమానులకు షాకిచ్చారు.నవీన్ చంద్ర అభిమానులలో చాలామంది అభిమానులకు నవీన్ చంద్రకు పెళ్లైందనే విషయం తెలియదు.

ప్రస్తుతం అరవింద్ డైరెక్షన్ లో నవీన్ చంద్ర ఒక సినిమాలో నటిస్తున్నారు.

తన భార్యతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ తన బెటర్ హాఫ్ ఓర్మా అని నవీన్ చంద్ర చెప్పుకొచ్చారు.

లవ్ ఎప్పుడూ హార్ట్ లో ఉంటుందని హ్యాపీ వాలెంటైన్స్ డే వైఫీ అంటూ నవీన్ చంద్ర కామెంట్లు చేశారు.నవీన్ చంద్ర, అతని భార్య ఫోటోలను చూసిన నెటిజన్లు క్యూట్ కపుల్ అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

అయితే నవీన్ చంద్ర పెళ్లి ఎప్పుడు జరిగిందో తెలియాల్సి ఉంది.

నవీన్ చంద్ర పరంపర అనే వెబ్ సిరీస్ లో నటించగా ఆ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీలలో ఒకటైన హాట్ స్టార్ లో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.నవీన్ చంద్ర కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Hero Naveen Chandra Introduced his Wife Naveen Chandra

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube