పెళ్లి అనే బంధానికి మన దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.వివాహ బంధంతో ఇద్దరు వ్యక్తులు ఒకటి అయ్యి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు.
అయితే మనం ఇప్పటిదాకా ఒక ఆడ, మగ పెళ్లి చేసుకోవడం లేదంటే ఇద్దరు ఆడవాళ్లు, ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం గురించి వినే ఉంటాము.కానీ లింగ మార్పిడి చేయించుకున్న ఇద్దరు ట్రాన్స్ జెండర్లు వివాహం చేసుకోవడం గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా.
ఈ విచిత్రమైన ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది.
లింగ మార్పిడి చేయించుకున్న ఇద్దరు ట్రాన్స్జెండర్లు వివాహం చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి అవ్వడం విశేషం అనే చెప్పాలి.
అయితే వీరి పెళ్లిలో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందండోయ్.అదేంటంటే ప్రేమికుల రోజునే వీరు పెళ్లి జరగడం విశేషం అనే చెప్పాలి.
అసలు వివరాల్లోకి వెళితే.
శ్యామ ఎస్ ప్రభ, మను కార్తిక అనే వాళ్ళు పదేళ్లుగా స్నేహితులు.
ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు.ఒక ఐదేళ్ల క్రితమే ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే వారు లింగమార్పిడి చేయించుకున్నారు.ఆ తరువాత ప్రేమికుల రోజున తిరువ నంతపురంలో బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి అనే బంధంతో ఒక్కటయ్యారు.
అయితే ఇలా పెళ్లి చేసుకోవడం అనేది చట్ట బద్ధం కాదు అని ఈ పెళ్లిపై వారు కోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు ఎస్ ప్రభ, మను.