ఏపీ క్యాబినెట్ లో ప్రక్షాళన చేపట్టేందుకు జగన్ సిద్ధమయ్యారు.మరి కొద్ది రోజుల్లోనే కొలువుతీరబోతోంది.
ప్రస్తుతం ఉన్న మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తారా లేక కొంతమందిని మాత్రమే తప్పించి మరికొంత మందికి అవకాశం కల్పిస్తారా అనేది క్లారిటీ లేక పోయినప్పటికీ , విస్తరణ అయితే పక్కా అని వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.అసలు ఏపీ క్యాబినెట్ ను ఎప్పుడో విస్తరించాల్సి ఉన్నా, అనేక కారణాలతో జగన్ ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు.
ప్రస్తుత మంత్రులలో చాలామంది పనితీరుపై జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేసే విధంగా మంత్రిమండలిని జగన్ నియమించబోతున్నారు.
అలాగే పార్టీ సీనియర్లు గా ఉన్న ఎమ్మెల్యేలకు స్థానం దక్కే పోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
కొత్త మంత్రివర్గంలో చోటు సంపాదించుకునేందుకు ఇప్పటికే చాలామంది జగన్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
జిల్లాల వారీగా మంత్రిపదవులు ఆశిస్తున్నవారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, విజయనగరం నుంచి రాజన్నదొర, కోలగట్ల వీరభద్రస్వామి, విశాఖ నుంచి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, తూర్పుగోదావరి నుంచి దాడిశెట్టి రాజా, పొన్నాడ సతీష్, కొండేటి చిట్టిబాబు, పశ్చిమ గోదావరి నుంచి ముదునూరు ప్రసాద్ రాజ్ , గ్రంధి శ్రీనివాస్, బాలరాజు, కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి , జోగి రమేష్, సామినేని ఉదయభాను, గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు, జంగా కృష్ణమూర్తి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రకాశం జిల్లా నుంచి మహీధర్ రెడ్డి, అన్నా రాంబాబు, సుధాకర్ బాబు, నెల్లూరు జిల్లా నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి ద్వారకనాథ రెడ్డి, ఆర్ కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి , కడప జిల్లా నుంచి కోరుముట్ల శ్రీనివాసులు, సి రామచంద్రయ్య, శ్రీకాంత్ రెడ్డి, కర్నూలు జిల్లా నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, హాఫీస్ ఖాన్ , అనంతపురం జిల్లా నుంచి అనంత వెంకట్రామిరెడ్డి, ప్రకాష్ రెడ్డి ,ఉష శ్రీ చరణ్, కాపు రామచంద్రారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి తదితరులు మంత్రి వర్గంలో స్థానం ఆశిస్తున్నారు.