సీరియల్ నటి శ్రీవాణి ని షాపింగ్ మాల్ లో ఇరికించేసిన హిమజ.. ఏం జరిగిందంటే?

బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న బుల్లితెర నటి హిమజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా బుల్లితెర ద్వారా మంచి గుర్తింపు పొందిన ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లారు.

 Serial Actress Srivan  Himaja In A Shopping Mall Do You Know Hat Happened  Seria-TeluguStop.com

ఇక బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఈమెకు మరింత పాపులారిటీ వచ్చిందని చెప్పాలి.బిగ్ బాస్ కార్యక్రమం తరువాత హిమజ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండటమే కాకుండా పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథిగా వెళ్తున్నారు.

ఇలా షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవం అంటేనే చాలా మందికి టక్కున హిమజ పేరు గుర్తుకు వస్తుంది అలా పాపులారిటీ దక్కించుకున్న హిమజా తాజాగా మరొక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లారు.

అయితే ఈమెతో పాటు బుల్లితెర నటి శ్రీవాణి కూడా ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్లారు.

ఆర్ఎన్ సిల్క్స్ కొత్త బ్రాంచ్ ను దిల్ షుక్ నగర్ లో ప్రారంభించారు.ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హిమజ శ్రీ వాణి ఆహ్వానించగా వీరిద్దరూ ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.వీరిద్దరూ కలిసి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం షాప్ లో ఉన్నటువంటి విభిన్న రకాల డిజైన్లను చూపించారు.

ఇలా ఈ కార్యక్రమం అనంతరం మీడియా వీరిద్దరిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ వీరి నుంచి సమాధానం రాబట్టారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నటి శ్రీవాణి ను ప్రశ్నిస్తూ మీరు రోజుకి ఎన్ని చీరలు కడతారని అడిగారు.ఈ సందర్భంగా ఆమె సీరియల్స్ షూటింగ్ నిమిత్తం ఎన్నో రకాల చీరలను కడతామని మా చీరలు చూసి చాలామంది అలాంటి చీరలు కొనడానికి వస్తారంటూ ఈ సందర్భంగా శ్రీ వాణి మాట్లాడగా.వెంటనే హిమజ స్పందిస్తూ… మీరు ఇలాంటి కామన్ ప్రశ్నలు అడగకూడదు.

ఏవైనా కొత్తగా అడగండి అంటూ తెలియజేశారు.ఇప్పటివరకు మీ చీరల కోసం మీ ఆయనతో ఎంత ఖర్చు పెట్టించారు అలా కొత్తగా అడిగితే యూట్యూబ్ ఛానల్ థంబ్ నెయిల్ కోసం పనికి వస్తాయి అంటూ హిమజ రిపోర్టర్స్ దగ్గర శ్రీవాణిను అడ్డంగా ఇరికించారు.

ఈ విధంగా వీరిద్దరూ కలిసి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లడంతో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే నటి శ్రీవాణి ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు.ఇక ఈ మధ్య కూడా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Serial Actress Srivan Himaja In A Shopping Mall Do You Know Hat Happened Serial Actress Srivani,himaja, Tollywood, Booked, Shopping Mall, Biggboss - Telugu Himaja, Serialactress, Mall, Tollywood

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube