రామ్ చరణ్ తో త్రివిక్రమ్ సినిమా.. నిర్మాత ఏం అన్నాడంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ విడుదలకు సిద్ధంగా ఉంది.

 Trivikram Movie With Ram Charan Do You Know What Producer Say, Trivikram, Direct-TeluguStop.com

అదేవిధంగా కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా కూడా త్వరలో విడుదల కాబోతోంది.ఇలా రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగానే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు.

ఇప్పటికే రెండు షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకొని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారు.ఇకపోతే ఈ చిత్రం తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ మరో సినిమా చేయనున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలన్నీ తర్వాత సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రామ్ చరణ్ తో మరో సినిమా చేయనున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ వెల్లడించారు.

మా బ్యానర్ లో రామ్ చరణ్ తో సినిమా చేస్తే ఆ చిత్రానికి దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యవహరిస్తారని ఈ సందర్భంగా నిర్మాత రామ్ చరణ్ సినిమా గురించి తెలియజేశారు.దీన్ని బట్టి చూస్తుంటే సితార బ్యానర్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా ఉండ బోతోందని తెలుస్తోంది.అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే ఇప్పటికీ ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు.

ఇక చరణ్ త్రివిక్రమ్ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube