బ్రహ్మానందంను మధ్యలోకి లాగింది.. దుమ్ములేపిన శ్రీముఖి!

బుల్లితెరపై ప్రసారమైన పటాస్ కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన శ్రీముఖి తన మాస్ యాటిట్యూడ్ ద్వారా బుల్లితెర రాములమ్మగా పేరు సంపాదించుకుంది.

 Brahmanandam Involved In The Middle By Srimukhi Details,  Srimukhi, Tollywood, A-TeluguStop.com

ఈ విధంగా బుల్లితెరపై పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు దూసుకుపోతున్న శ్రీముఖి బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్నారు.బిగ్ బాస్ విన్నర్ రేసులో ఉన్న ఈమె చివరికి రన్నర్ గా మిగిలిపోయారు.

అయితే బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ వచ్చినప్పటికీ ఈమెకు అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదని చెప్పాలి.బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీముఖి వరస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా మారుతుందని ఎంతోమంది భావించినప్పటికీ ఎలాంటి అవకాశాలను అందుకోలేక ప్రస్తుతం బుల్లితెరకు కూడా దూరం అయింది.

బుల్లితెరపై ఏదైనా ప్రత్యేక ఈవెంట్ల ద్వారా మాత్రమే శ్రీముఖి సందడి చేస్తున్నారు.ఇక స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈమె ఉన్నఫలంగా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఈమె స్థానంలో దీపికా పిల్లి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ఇలా బుల్లితెరపై కనుమరుగైన శ్రీముఖి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఈ మధ్య కాలంలో క్రేజీ అంకుల్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోలేకపోయింది.

అయితే ప్రస్తుతం మరొక ప్రాజెక్టుతో శ్రీముఖి ఎంతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా వెండితెరపై అవకాశాలను అందుకుంటూ ఉన్న రాములమ్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఇలా సోషల్ మీడియా వేదికగా తన స్నేహితులతో కలిసి చేసే రచ్చ మామూలుగా ఉండదు.ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందులో తన స్నేహితుడు సింగర్ సాకేత్ పుట్టినరోజు కావడంతో తనకు విభిన్న శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా తనకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ దిడే రా సాకేత్ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ చేయడమే కాకుండా వీరి డాన్స్ వీడియోలో కామియో రోల్ లోకి బ్రహ్మానందాన్ని లాగుతూ ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇలా ఈ డాన్స్ వీడియోని ఇంస్టాగ్రామ్ రీల్ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ చేయడమే కాకుండా నువ్వు సూపర్ అక్క అంటూ శ్రీముఖి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.మొత్తానికి శ్రీముఖి తన డాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.ఈ వీడియో పై ఎంతోమంది అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ శ్రీముఖి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube