ఊ అంటావా.. ఊఊ అంటావా.. అంటూ నవ వధువు స్టెప్పులు.. నెట్టింట వైరల్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా పుష్ప.ఈ సినిమాలో ప్రతి సాంగ్ అద్భుతంగా ఉంది.

 Newlywed Karishma Tanna Grooves To Samantha Oo Antava At Her Reception Details,-TeluguStop.com

ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ఎక్కడ విన్న పుష్ప సాంగ్స్ నే వినిపిస్తున్నాయి.ఏ ఇండస్ట్రీ చూసిన పుష్ప మ్యానియానే నడుస్తుంది.

ఇక ”ఊ అంటావా.ఊఊ అంటావా మామ” సాంగ్ ఈ సినిమాకే హైలెట్.

పుష్ప సినిమాలో ఈ పాటకు స్టార్ హీరోయిన్ సమంత ఆడిపాడిన విషయం తెలిసిందే.ఈమె ఈ పాటతో సౌత్ ఇండియన్ కాదు నార్త్ ఇండియాను కూడా ఊపేసింది.

ఈ పాటకు సోషల్ మీడియాలో కొన్ని వందల మంది డ్యాన్స్ స్టెప్పులు వేసి వీడియోలు పోస్ట్ చేసారు.తాజాగా బాలీవుడ్ నవ వధువు ఈ పాటకు ఆడిపాడింది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బాలీవుడ్ నటి కరిష్మా తన్నా వ్యాపారవేత్త వరుణ్ బెంగేరా ను ఫిబ్రవరి 5న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ముంబై లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు దగ్గర బంధువులు, ప్రముఖ సెలెబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు.గ్రాండ్ దుస్తులలో పెళ్లి జరుపుకున్న వీరి ఫోటోలు సోషల్ మీడియాలో నిన్నటి నుండి వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ శనివారం రాత్రి వారి రెసెప్షన్ జరగగా అందులో కరిష్మా పుష్ప సినిమాలోని ”ఊ అంటావా.ఊఊ అంటావా మామ” సాంగ్ హిందీ వర్షన్ కు స్టెప్పులు వేసి నవ వధువు ఇరగ దీసింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఈమె సీరియల్ నటిగా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

గ్రాండ్ మస్తీ, సంజు వంటి సినిమాల్లో ఈమె మెరిసింది.

Newlywed Karishma Tanna Grooves To Samantha Oo Antava At Her Reception Details, Karishma Tanna, Samantha, Oo Antava Song, Karishma Tanna Dance, Karishma Tanna Wedding, Karishma Tanna Receptiona, Pushpa Item Song - Telugu Karishma Tanna, Karishmatanna, Oo Antava, Pushpa Item, Samantha

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube