న్యూస్ రౌండప్ టాప్ 20

1.కెసిఆర్ దళితులను మోసం చేశారు : సంజయ్

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ మొట్టమొదటిగా దళితులను మోసం చేశారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

2.ఉద్యోగ సంఘాలతో జగన్ సమావేశం

ఉద్యోగ సంఘాల నాయకులతో ఏపీ సీఎం జగన్ సమావేశం అయ్యారు.

3.లతా మంగేష్కర్ మృతి పై కేసిఆర్ సంతాపం

ప్రముఖ సినీ గాయని లతా మంగేష్కర్ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.

4.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,07,674 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

5.భక్తులతో కిక్కిరిసిన మేడారం

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా లో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది.భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసి పోయింది.

6.  మెగా జాబ్ మేళా

హైదరాబాదులో మెగా జాబ్ మేళా ఈ నెల 8న హైదరాబాద్ లో జరగనుంది.ఉదయం 09 గంటల నుంచి మధ్యాహ్నం 01 వరకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తారు.

మరింత సమాచారం కోసం 8374315052

7.ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయి

ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయి అని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.

8.బీడీఎస్ సీట్ల భర్తీకి వెబ్ కౌన్సిలింగ్

తెలంగాణలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా బీడీఎస్ సీట్ల భర్తీకి తుది వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.

9.యాదాద్రి లో భక్తుల రద్దీ

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

10.ట్రేడ్ లైసెన్స్ లేకపోతే వంద శాతం జరిమానా

ట్రేడ్ లైసెన్స్ లేని దుకాణదారులకు వంద శాతం పెనాల్టీ విధించాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది.

11.ఏపీ ఎన్జీవో నుంచి బయటకి వచ్చిన ఏపీటీఎఫ్

ఏపీఎన్జీవో జెఏసి నుంచి ఎఫీటీఎఫ్ బయటకు వచ్చింది.జేఏసీ లోని పదవులకు ఏపీ టీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు రాజీనామా చేశారు.

12.లతా మంగేష్కర్ మృతిపై ఏపీ సీఎం జగన్ సంతాపం

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతిపై సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు.

13.ఫిట్ మెంట్ 30 శాతం ఇవ్వాల్సిందే

ఫిట్మెంట్ 30శాతం ఇవ్వాల్సిందేనని ఉపాధ్యాయ సంఘాలు  ఏపీ ప్రభుత్వం ను డిమాండ్ చేస్తున్నాయి.

14.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.శనివారం తిరుమల శ్రీవారిని 34,632 మంది భక్తులు దర్శించుకున్నారు.

15.రాజంపేట కోసం మూకుమ్మడి రాజీనామాలు

కడపలోని రాజంపేట పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే వైసీపీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని వైసిపి కువైట్ ఎన్నారై విభాగం హెచ్చరించింది.

16.’ కన్నడ కబీర్ ‘ ఇబ్రహీం సుతార మృతి

‘ కన్నడ కబీర్ ‘ గా గుర్తింపు పొందిన కర్ణాటక కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత  ఇబ్రహీం సుతార ( 82)  కన్నుమూశారు.

17.లతా మంగేష్కర్ మృతికి ప్రధాని సంతాపం

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతికి ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు.

18.పుదుచ్చేరి సీఎం తో హీరో విజయ్

పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి తో తమిళ సినీ హీరో విజయ్ భేటీ అయ్యారు.

19.పవన్ కళ్యాణ్ విమర్శలు

ఉద్యోగుల పై ఏపీ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి సమ్మె మంత్ర చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,100

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 49,200

.

Telangana Headlines, News Roundup, Top20News, Telugu News Headlines, Todays Gold Rate, Corona Cases, AP,Bandi Sanjay, KCR, Lata Mangeshkar Death, PM Modi, Yadadri, Hero Vijay - Telugu Bandi Sanjay, Corona, Vijay, Lata Mangeshkar, Pm Modi, Telangana, Telugu, Todays Gold, Top, Yadadri

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube