కరోనా టైంలోనూ టాలీవుడ్ ప్రేక్షకుల డేర్.. బాలీవుడ్ కంటే మనమే బెస్ట్..

కరోనా దెబ్బకు తెలుగు సినిమా పరిశ్రమ అల్లాడింది.జనాలు అప్పట్లో థియేటర్లకు వచ్చేందుకే గజగజ వణికారు.

 Tollywood Is The Best In Bollywood Also Details, Tollywood, Corona Effect, Tolly-TeluguStop.com

అయితే ఇతర సినిమా పరిశ్రమలతో పోల్చితే తెలుగు జనాలు మాత్రం బాగానే సినిమా హాల్లో సినిమాల చేశారు.కరోనా వచ్చినా థియేటర్లు కిటకిటలాడాయి.అంతా బాగున్నప్పుడు థియేటర్లకు వచ్చిన జనాలతో పోల్చితే ప్రస్తుతం కూడా బాగానే జనాలు సినిమాలు చూస్తున్నారు.

2018-19 సీజన్ లో థియేటర్లకు వచ్చిన బాలీవుడ్ ఆడియెన్ 65.7 కోట్ల మంది.అటు 2020-21 సీజన్ కు వచ్చే సరికా ఆ సంఖ్య కేవలం 10.6 కోట్ల మందికి పడిపోయింది.కరోనా సినిమా పరిశ్రమ మీద భారీగా పడ్డది అని చెప్పడానికి ఇంతకంటే రుజువేం కావాలి.అటు తమిళ సినిమాలు చూసే జనాల సంఖ్య 36.2 కోట్ల నుంచి 14.4 కోట్లకు తగ్గిపోయింది.ఇక తెలుగు పరిస్థితి మాత్రం కాస్త భిన్నంగా ఉంది.కరోనాకు ముందు వరకు 36.8 కోట్ల ఆడియెన్స్ సినిమాలు చూశారు.కరోనా టెన్షన్ ఉన్నా కూడా భారీగానే థియేటర్లకు వచ్చారు.2021-22 సీజన్ లో మాత్రం థియేటర్లకు వచ్చిన సంఖ్య 23.4 కోట్లు.అంటే కరోనాకు ముందు, తర్వాత కూడా పెద్దగా తేడా ఏమీ లేదు.

అటు ఇండియాలో నెంబర్ వన్ అని చెప్పుకునే బాలీవుడ్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.ఉత్తరాదిన థియేటర్లకు వచ్చే వారి సంఖ్య భారీగా పడిపోయింది.

Telugu Bollywood, Corona Effect, Mollywood, Lovers, Pan India, Sandalwood, Tolly

మాలీవుడ్ లోనూ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.కరోనా సీజన్ లో కేవలం 5.1 కోట్ల మంది మాత్రమే సినిమాలు చూశారు.కన్నడలో 5.4 కోట్ల టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.పంజాబ్ లో 1.1 కోట్లు, మహారాష్ట్రలో 40 లక్షల టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.తెలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి ఎక్కువగా ఉన్నా 23 కోట్ల మంది సినిమాలు చూడటానికి రావడం అనేది కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది.

సౌత్ లో ఇతర పరిశ్రమలతో పోల్చితే పెద్ద ఇండస్ట్రీగానే చెప్పుకోవచ్చు.ప్రస్తుతం వస్తున్న పాన్ ఇండియన్ సినిమాలతో టాలీవుడ్ గొప్పతనం మరింత పెరిగే అవకాశం ఉంది.తెలుగు సినిమా పరిశ్రమ బాలీవుడ్ ను త్వరలోనే బీట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube