టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీమేక్ సినిమాల హవా కొనసాగుతోంది.ఇప్పటికే తమిళ మలయాళ సూపర్ హిట్ చిత్రాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మరో మలయాళ సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడం కోసం సురేష్ ప్రొడక్షన్స్ పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.మలయాళంలో మోహన్ లాల్, పృధ్విరాజ్ తండ్రీ కొడుకులుగా నటించిన చిత్రం ‘బ్రోడాడీ’.
ఈ సినిమా తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
సొంత కొడుకుని తమ్ముడిగా భావించే తండ్రి తండ్రిని అండగా భావించే కొడుకు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటూ వీరికి వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించుకుంటారనే కుటుంబ కథ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను కొనుగోలు చేయడం కోసం సురేష్ ప్రొడక్షన్స్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా చూసిన సురేష్ బాబు ఈ కథకు రానా వెంకటేష్ సరిగ్గా సరిపోతారని ఎలాగైనా ఈ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వెంకటేష్ ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందిన సంగతి మనకు తెలిసిందే.అదేవిధంగా బాబాయ్ తో ఎంతో చనువుగా వుండే రానాకు తనతో కలిసి నటించడం పెద్ద కష్టమైన పని కాదని త్వరలోనే వీరిద్దరిని తండ్రీకొడుకులుగా చూపించే ప్రయత్నంలో నిర్మాత సురేష్ బాబు ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాకు పెద్ద ఎత్తున పోటీ ఉండటంతో సురేష్ బాబు ఎలాగైనా రీమేక్ హక్కులను కొనుగోలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
మరి సురేష్ బాబు ప్రయత్నాలు ఫలిస్తాయా! వెంకటేష్, రానా తండ్రీకొడుకులుగా ప్రేక్షకులను సందడి చేయనున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.